Friday, April 26, 2024
- Advertisement -

జగనన్నకు తలనొప్పిగా మారిన “అన్నా క్యాంటీన్లు” !

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ” అన్నా క్యాంటీన్ ” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా కేవలం అయిదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. దాంతో చంద్రబాబు ప్రవేశ పెట్టిన “అన్నా క్యాంటిన్ ” లపై రాష్ట్ర ప్రజలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రశంశలు కురిపిస్తూనే ఉన్నారు. అయితే వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో ఉన్న చాలా పథకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. అయితే పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ” అన్నా క్యాంటిన్ ” లను వైఎస్ జగన్ ఏమాత్రం రద్దు చేయరాని రాష్ట్ర ప్రజలు భావించారు. .

అయితే ఊహించని విధంగా వైఎస్ జగన్ వాటిని కూడా రద్దు చేశారు. దాంతో జగన్ వైఖరిపై అటు ప్రతిపక్ష టీడీపీ నుంచి ఇటు రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే అన్నా క్యాంటిన్ ల స్థానంలో రాజన్న క్యాంటీన్లు జగన్ ప్రవేశ పెట్టె అవకాశం ఉందని భావించరంతా. కానీ వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చి మూడేళ్లు దాటిన క్యాంటిన్ ల ప్రస్తావన ఊసే లేదు. దాంతో పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ” అన్నా క్యాంటీన్లు ” రద్దు చేయడంపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ కూడా జగన్ వైఖరిపై వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్వతహాగా ప్రారంభించేందుకు పూనుకుంది.

ఇప్పటికే ఆయా చోట్ల టీడీపీ నేతలు అన్నా క్యాంటిన్ లను పునః ప్రారంభించారు. దీంతో అయిదు రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్ ల ద్వారా టీడీపీ మళ్ళీ ప్రజల్లో మైలేజ్ సంపాధించుకునే అవకాశం ఉంది. దాంతో చాలా చోట్ల ” అన్నా క్యాంటిన్ ” ల పునః ప్రారంభాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రక్యత్నం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ ” అన్నం తినే వారెవ్వరూ.. అన్నా క్యాంటిన్ లను అడ్డుకోరని.. మరి జగన్ తింటున్నది ఏంటో ఆయనే తేల్చుకోవాలని.. ” ఘాటుగా మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికి అన్నా క్యాంటిన్ ల నిర్వాకం ప్రస్తుతం వైఎస్ జగన్ కు తలనొప్పిగా మారింది.

Also Read

రేషన్ షాపులకు మోడీ ఫోటో పెట్టాలట..!

పోరాడతారా.. ఇంటికే పరిమితం అవుతారా ?

పేద విద్యార్థులపై.. ఇంత నిర్లక్ష్యమా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -