Thursday, April 25, 2024
- Advertisement -

రేషన్ షాపులకు మోడీ ఫోటో పెట్టాలట..!

- Advertisement -

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ ఇటీవల తెలంగాణలోని కామారెడ్డిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఆమె బాన్సువాడ చేరుకున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలంటూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు.. ఇక బీర్కూర్ పట్టణంలో ఒక రేషన్ షాప్ లో ఆమె కలెక్టర్ పై వ్యవహరిచిన తీరుతో టి‌ఆర్‌ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. పేదలకు రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న పథకంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను అడుగగా ఆయన అంచనగా చెప్పే ప్రయత్నం చేశారు.

దాంతో నిర్మలసీతారామన్ ఆగ్రహం చెంది తనకు కచ్చితమైన వివరాలు కావాలని..కలెక్టర్ జితేష్ పటేల్ ను నిలదీశారు. దీంతో నిర్మలసీతారామన్ వ్యవహార శైలిని తప్పుబడుతూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కొందరు రాజకీయ నేతల ప్రవర్తన చూసి సివిల్ అధికారులు భయపడుతున్నారని, ఒక మేజిస్ట్రీట్ తో నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరు తనను విస్మయనికి గురి చేసిందని ” కే‌టి‌ఆర్ ఘాటుగా స్పందించారు. ఇక నిర్మలసీతరామన్ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం గురించి మాట్లాడుతూ.. ఉచిత బియ్యం పథకం ద్వారా పేదలకు అండగా నిలుస్తున్న ప్రధాని మోడీ ఫోటో ను ప్రతి రేషన్ షాప్ లో ఉంచాలని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ. ” ఒక మంత్రి హోదాలో ఉన్న నిర్మలసీతరామన్.. ప్రధాని ఫోటోలు పెట్టాలని కోరడం ఏంటని ప్రశ్నించారు.. అలా వ్యాఖ్యలు చేయడం ప్రదనమంత్రి హోదాను దిగజార్చడమే అవుతుందని ” హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అయితే రేషన్ షాపులకు ప్రధాని పోటో పెట్టాలని నిర్మలసీతరామన్ చేసిన వ్యాఖ్యలపై చాలా వరకు విమర్శలే ఎదురవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి నిర్మలసీతామన్ తెలంగాణలో చేసిన మూడు రోజుల పర్యటనలో పలు అంశాలు రాజకీయ వేడిని పెంచడం గమనార్హం.

Also Read

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్

పేద విద్యార్థులపై.. ఇంత నిర్లక్ష్యమా !

ఆర్‌ఎస్‌ఎస్ కు మద్దతుగా మమత.. బీజేపీకి భయపడుతోందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -