Thursday, May 16, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డిని చూసి వ‌ణికిపోతున్న తండ్రి,కొడుకులు

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.సీట్ల పంపకం పూర్తి అవ‌డంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హ‌కూటమి ప్ర‌చారంలో దూసుకుపోతుంది. ఎంతో ధీమాగా ఎన్నిక‌లకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాస్తా డీలా ప‌డిన‌ట్లుగానే క‌నిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమిలు ఉన్న వారిని కాద‌ని దూసుకువ‌చ్చాడు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ త‌రుపున ప్ర‌స్తుత‌నాకి అయితే ఆయ‌నే ద‌మ్మున్న నాయ‌కుడిలా క‌నిపిస్తున్నాడు. కేసీఆర్ అంటే చాలు ఒంటి కాలుతో వెళ్తూన్న రేవంత్ రెడ్డికి పార్టీ హైక‌మాండ్ నుంచి అన్ని అండ‌దండ‌లు ఉన్నాయి. ఎంత‌లా అంటే రేవంత్ రెడ్డికి ఏకంగా ఓ ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్‌ను ఏర్పాటు చేసి ప్ర‌చారానికి పంపిస్తుంది పార్టీ హైక‌మాండ్. పార్టీ ఇచ్చిన అండ‌తో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై రెచ్చిపోతున్నారు.

కేసీఆర్‌కు,కేటీఆర్‌కు ధీటుగా స‌మాధానం చెప్పే వారిలో రేవంత్ రెడ్డి మొద‌టి స్థానంలో ఉంటారన‌డంలో ఎటువంటి అతిశేయోక్తి లేదు.రేవంత్ రెడ్డి అవశ్య‌క‌త‌ను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయ‌న చేత రోజుకి నాలుగైదు మీటింగ్‌లు పెట్టిస్తుంది.ఇక రేవంత్ రెడ్డికి వ్య‌క్తిగ‌తంగా కూడా కేసీఆర్ అంటే ప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌రింత అగ్రెసీవ్‌గా ముందుకు వెళ్తున్నారు.రేవంత్ రెడ్డి మీటింగ్‌ల‌కు ప్ర‌జ‌లు నుంచి భారీ ఎత్తున స్పంద‌న రావ‌డంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో చెబుతున్న రేవంత్ రెడ్డి,టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే మాత్రం ఏం చేస్తారో చెప్ప‌కుండా కూట‌మిని విమ‌ర్శిస్తున్నారని ప్ర‌చారం చేస్తు టీఆర్ఎస్ పార్టీపై అనుమానాలు రేక‌త్తించ‌డంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి.ఎన్నిక‌లకు వెళ్లే ముందు 100 సీట్లు ఖాయం అన్న కేసీఆర్ ,ఇప్పుడు 70 సీట్లు మావే అన‌డంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు నమ్ముతున్నాయి.ఇంకా ఎన్నిక‌ల‌కు మ‌రో ప‌ది రోజులు స‌మ‌యం ఉండ‌టంతో టీఆర్ఎస్ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోవ‌డం ఖాయం అంటున్నారు రాజ‌కీయ విశ్లేషుకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -