Sunday, May 12, 2024
- Advertisement -

కెమెరాలంటేనే ప‌రుగులు పెడుతున్న ప‌చ్చ పార్టీ త‌మ్ముళ్లు

- Advertisement -

ఎక్క‌డైనా ఉప ఎన్నిక‌లో అధికార‌పార్టీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం స‌హ‌జం.కాని నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోమాత్రం సీన్ రివ‌ర్స్ అవుతోంది. ప్ర‌చారానికి వెల్లిన ప్ర‌తీ చోట ప్ర‌జ‌ల‌నుంచి చేదు అనుభ‌వాలు ఎద‌ర‌వుతున్నాయి.ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల‌ను ప్ర‌జ‌లు చీల్చి చెండాడుతున్నారు.అంతేకాదు సెల్ఫీ,మీడియా అంటేనే ప‌చ్చ త‌మ్ముల్లు ప‌రుగులు పెడుతున్నారు.
ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన అధికార పార్టీ నేత‌ల‌కు ఓట‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు.ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనేవిధంగా ప్ర‌చారం ఉండాలిగాని మా ఇష్టం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ప్ర‌చారానికి వెళ్లిన నేత‌ల‌ను జనం నిల‌దీస్తున్నారు. మీరు ఏం చేశార‌ని క‌డిగిపారేస్తున్నారు. అంతేకాదు. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా జ‌నంలోకి వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు సెల్ క‌న‌ప‌డితే చాలు వ‌ణికిపోతున్నారు. జ‌నం త‌మ‌ని నిల‌దీసే సీన్లు క‌నిపిస్తే అవి ఎక్క‌డా రికార్డు అవుతాయోననే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే టీడీపీ నేత‌లు ప్ర‌చారానికి వెళ్లాలంటే భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌.
ఈ మ‌ధ్య‌కాలంలో సెల్ఫీల జోరు కొన‌సాగుతోంది.ఏంజ‌రిగినా సెల్ఫీ తీసి వెంట‌నే సోషియ‌ల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఇదే ఇప్పుడు టీడీపీ నాయ‌కుల‌ను వ‌నికిస్తోంది.ప్ర‌చారంలో ఎక్క‌డికెల్లినా కెమెరాక‌న్ను మ‌న‌మీద‌నే ఉంటాయ‌న్న సంగ‌తి మ‌ర‌చిపోయి నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.
ఈ మ‌ధ్య‌నే చంద్ర‌బాబునేనిచ్చే పెన్షన్ తీసుకుంటూ, నేనేసిన రోడ్లపై నడుస్తూ.. నాకు కాకుండా మరెవరికీ ఓటేస్తారు, మాకు ఓటేయకపోతే పెన్షన్ తీసుకోవద్దు?’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు మీడియాలో వాడివేడి చర్చలకు దారి తీశాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లా అధ్యక్షుడు మంత్రి సోమిశెట్టి.. నంద్యాలలో టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్ ఎత్తేస్తామంటూ వ్యాఖ్యానించడం మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇవ‌న్నీ కూడ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.
దెబ్బ‌తో టీడీపీ నేతలు ఏకంగా సొంత మీడియాను కూడా తమ సమావేశాలకు అనుమతించడం లేదట.సమావేశాల్లో నేతలు సైతం మొబైల్ తో వీడియోలు తీయకుండా.. కొంతమంది ప్రత్యేకంగా వారిని కనిపెట్టుకుని కూర్చుంటున్నారట. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నిక పూర్తయ్యేదాకా టీడీపీకి కెమెరా భయం తప్పేటట్లు లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -