Friday, May 3, 2024
- Advertisement -

పీకే ఫైన‌ల్ స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు

- Advertisement -

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీలు వ్యూహ‌,ప్ర‌తివ్యూహాలు, స‌ర్వేల‌తో బిజీగా ఉన్నాయి. ప్రత్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టి నుండి రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. వైసీపీ ఎన్నిక‌ల‌వ్యూహ‌క‌ర్తగా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. పీకే అనేక‌సార్లు అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వేచేసి పీకే ఫైన‌ల్ స‌ర్వే రిపోర్ట్ ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది.

జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌ల నుంచి ఊహించ‌ని రీతిలో ప్ర‌జా స్పంద‌న వ‌స్తోంది. అదే స‌మ‌యంలో పీకే కూడా త‌న స‌ర్వే టీమ్‌తో రాష్ట్రంలోని 175 సెగ్మెంట్‌ల‌లో పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వే చేయించారు. ఇక ఒక్కో సెగ్మెంట్ నుంచి దాదాపు వెయ్యి మంది అభిప్రాయాలు తీసుకున్నారంట‌. అన్ని సెగ్మెంట్‌ల‌లో రిపోర్ట్స్ వ‌డ‌పోసి ఫైన‌ల్ రిజల్ట్ చూసి షాక్ అయ్యారట‌. మోత్తం 175 స్థానాల్లో వైసీపీ పుంజుకుంద‌ని.. 43 శాతం ఓట్ల‌తో వైసీపీ 118 స్థానాలు కైవ‌సం చేసుకోనుంద‌ని.. మిగ‌తా సెగ్మెంట్‌ల‌లో కూడా గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని తేలింద‌ట‌.

మిత్ర‌ప‌క్ష్గంగా ఉన్న టీడీపీ-బీజేపీ కూట‌మికి మాత్రం 47 స్థానాలు, జ‌న‌సేన‌కి 8, కాంగ్రెస్‌కి 2 సీట్లు రావొచ్చ‌ని పీకే స‌ర్వే రిపోర్ట్ తేల్చేసింది. వైసీపీకీ ప్రాధాన్య‌త పెర‌గ‌డానికి జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌నాల్లోకి బాగా చొచ్చుకుపోయింద‌న‌డంలో సందేహంలేదు. జ‌గ‌న్ ప్ర‌ణాళికా ప‌రంగా ఇస్తున్న హామీలు.. ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచిద‌ట‌. ప్రత్యేక హోదాఅంశంకూడా ప్ర‌జ‌ల‌ల్లో జ‌గ‌న్‌కు మంచి మైలేజీ తెచ్చిపెట్టింది. అవిశ్వాసం తీర్మానం పెడతామ‌ని అవ‌స‌రం అయితే ఎంపీల చేత రాజీనామాలు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని జ‌గన్ సంచ‌ల‌న‌ ప్రకటనతో వైసీపీ మైలేజ్ అమాంతంగా పెంచేసిందట‌. పీకే ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్స్ తో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో మ‌రింత కాన్ఫిడెన్స్ పెరిగిందంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -