ఏపిలో అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహమ్మద్ ఇక్బాల్, చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నీసా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యత్వాల కోసం అందిన ఆరు నామినేషన్లు ఏకగ్రీవం అయినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు.
కాగా, ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా మరే ఇతర నామినేషన్లు దాకలు కాకపోవడంతో వారంతీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కొత్తగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలో శాసనమండలిలో చేరడంతో వైసీపీ బలం కూడా పెరిగినట్లయింది.
ప్రస్తుతం ఈ ఆరుగురితో మండలిలో వైసీపీ బలం 18కి చేరింది. ఇక అసెంబ్లీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డికి ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందజేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
