Thursday, May 2, 2024
- Advertisement -

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదన్నకేంద్రం!

- Advertisement -

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.  గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని విమర్శలను బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు. ఎవరు ఏం చెప్పినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100 శాతం ఆగేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికల ముందు కేంద్రం శుభవార్త చెబుతుందని ఆశిస్తే మరో షాక్ ఇచ్చింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఇదిలా ఉటే.. పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 100 శాతం ప్రైవేటుపరం చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి!

మంత్రి పువ్వాడ ఇంటికి మెగా హీరోలు!

కేసిఆర్ కి వాళ్ళ పట్ల గౌరవం ఎక్కువ. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -