Sunday, May 12, 2024
- Advertisement -

బాబు ఓటమి అర్థమైపోయిందా? దెబ్బమీద దెబ్బ కొడుతున్నారా?

- Advertisement -

చంద్రబాబు టైం అస్సలు బాగా లేదు. ప్రజలకంటే కూడా పారిశ్రామికవేత్తలను, ధనవంతులను ఎక్కువగా నమ్ముకునే చంద్రబాబుకు ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్తలే హ్యాండ్ ఇస్తున్నారు. ఎంతైనా బిజినెస్ పీపుల్ కాదు….విజయం సాధించేవాళ్ళతోనే ఉండాలనుకుంటారు. అందుకే చంద్రబాబు ఓటమిని ముందుగానే ఊహించిన ఈ బడాబాబులు అందరూ ఇప్పుడు జగన్‌కి జై కొడుతున్నారు. వీళ్ళలో స్వయంగా టిడిపికి చెందిన సొంత కులం పారిశ్రామికవేత్తలు కూడా ఉండడం బాబులో టెన్షన్ పెంచుతోంది. ఆల్రెడీ ఒక పచ్చ మీడియా ఛానల్ చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి జగన్‌కి జై కొట్టడం స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబుని, టిడిపిని నమ్ముకుని ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు తాజాగా జగన్‌కి టచ్‌లోకి వెళ్ళడం టిడిపి నేతల్లో టెన్షన్ పెంచుతోంది.

చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఒక తోక పత్రిక అధినేత స్వయంగా రంగంలోకి దిగి ఈ పారిశ్రామికవేత్తలను నయాన, భయాన ఒప్పించి టిడిపితోనే ఉంచే ప్రయత్నం చేశాడట. అయితే ఆ పారిశ్రామికవేత్తలు మాత్రం ఒక సారి జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని చంద్రబాబుతో సహా మీరంతా భయపడుతున్నారని…అలాంటి పరిస్థితి మాకు ఎందుకని నిలదీశారట. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏమీ ప్రమాదం ఉండదని, చంద్రబాబుకు మాత్రం ప్రమాదం ఉంటుందని……అందుకే తన భయాన్ని రాష్ట్ర ప్రజల భయంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చంద్రబాబు వర్గం అంతా చేస్తున్నారని ఒక పారిశ్రామికవేత్త ఘాటుగా కౌంటర్స్ ఇచ్చాడట. చినబాబు అవినీతితో, పెదబాబు అధికార గర్వంతో విసిగిపోాయమని….రేపు అధికారం పోయాక కూడా మమ్మల్నే త్యాగాలు చేస్తూ ఉండమని చెప్తే ఎలా అని గట్టిగా సమాధానం చెప్పి మరీ వైకాపా నేతలకు టచ్‌లోకి వెళ్ళారట ఆ పారిశ్రామికవేత్తలు. ఐదేళ్ళుగా ప్రజలకంటే ఎక్కువగా నమ్ముకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు తాను ఓడడం ఖాయం అని చెప్తూ జగన్‌వైపు వెళ్ళడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని స్వయంగా ఒక టిడిపి నాయకుడే వ్యాఖ్యానించడం పరిస్థితిని తెలియచేస్తోంది. ఇప్పటికే ఎన్జీవో సంఘం నాయకుడిగా అశోక్ బాబు స్థానంలో తన మనిషిని గెలిపించుకోవాలని చూసి దెబ్బతిన్నాడు బాబు. బాబుకు వ్యతిరేకంగా ఉన్న నాయకుడిని గెలిపించుకున్నారు ఎన్జీవోలు. ఇప్పుుడు పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబుకు దూరమవుతున్నారు. ఆల్రెడీ ప్రజలంతా కూడా చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారని జాతీయ మీడియా సంస్థలతో పాటు పచ్చ మీడియా సంస్థలు కూడా పరోక్షంగా ఒప్పేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గట్టిగా రెండు మూడు నెలల్లోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవనీయమైన స్థానాలు తెచ్చుకునే స్థాయిలో అయినా చంద్రబాబు ఉంటాడా? లేకపోతే ప్రతిపక్ష స్థానానికి కూడా అర్హత తెచ్చుకోలేని స్థితిలో ఉంటాడా అన్న విశ్లేషణలు వినిపిస్తూ ఉండడం చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పులు చేసి మరీ వరాల జల్లు కురిపిస్తూ ఉన్నాడు చంద్రబాబు. మరి ఈ చివరి జిమ్మిక్కులు అయినా బాబును నిలబెడతాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -