నంద్యాల ఉపె న్నిక నామినేషన్‌ల కార్యక్రమం దగ్గర పడటంతో రాజకీయాలు మలుపులు తిరుగుతన్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను బెదిరించిన టీడీపీ ఇప్పుడు సరికొత్తగా కిడ్నప్‌లకు తెరలేపింది. ఓటమి భయంతోనె చివరికి కిడ్నాప్‌లకు పాల్పడుతోంద. వైసీపీలో చేరిన టిడిపి కౌన్సిలర్ ను గుర్తుతెలీని వ్యక్తులు కిడ్నాప్ చేసారన్న ఆరోపణలతో కౌన్సిలర్ కుటుంబసభ్యులు, బంధువులు ధర్నా చేస్తున్నారు.
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వైసీపీ కార్యాలయం నుండి ఇంటికి వెళ్లి భోజనం చేసిన భాషా పనిమీద మళ్లీ బయటకు వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎవరికీ కనబడలేదు. అవసరమై భాషాతో మాట్లాడుదామనుకున్న కుటుంబసభ్యులు ఫోన్ చేస్తుంటే నో రిప్లై వస్తోందట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవటంతో కుటుంబసభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. గుర్తుతెలీని వ్యక్తులెవరో భాషాను కిడ్నాప్ చేసారంటూ ప్రచారం మొదలైంది. దాంతో పట్టణంలో అలజడి మొదలైంది.
అయితే, రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మళ్లీ భాషా టిడిపి కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. తనను బలవంతంగా వైసీపీ వాళ్ళు వాళ్ల కార్యాలయంకు తీసుకెళ్లారంటూ చెప్పటం గమనార్హం. కాగా కౌన్సిలర్ భాషా తనంతట తానుగా వైసీపీ కండువా కప్పుకున్న విషయం ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చూడబోతే ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ టీడీపీ డ్రామాలు మొదలుపెట్టిందా ఆన్న అనుమానాలు కలుగుతున్నాయి.
- Advertisement -
నంద్యాలలో బరితెగించిన టీడీపీ వైసీపీలో చేరిన కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామానా…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
