అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. అందునా హిందుపురంలో టిడిపినుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు గ్యారెంటీ. ఈ నియోజక వర్గంలో టీడీపీకీ ఎదురుగాలి వీస్తోంది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏపిలోని కొన్ని నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటల్లాగా నిలిచాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో టిడిపికి దాదాపుగా ఓటమన్నదే లేదు. అటువంటి నియోజకవర్గాల్లో హిందుపురం కూడా ఒకటి.
ప్రస్తుతం హిందూపురం నియోజక వర్గంనుంచి బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో అన్నగారి కొడుకన్న కారణంతో జనాలు బాలకృష్ణను ఆధరించారు. అటువంటిది తన వ్యవహారశైలితో బాలకృష్ణ పార్టీని కంపు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత నియోజక వర్గ పనులన్నింటినీ పీఏగా ఉన్న చంద్రశేఖర్‌కు అప్పగించారు. దాంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.
అదే సంయంలో బాలయ్య పేరుచెప్పి డబ్బులు వసూలు చేశారనే ఆరోపనలు వెల్లువెత్తాయి. దాంతోపాటు సీనియర్ నేతలను లెక్క చేయకపోవడంతో అక్కడి ప్రజలు,నేతల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇది గ్రహించిన బాలయ్య అతనిస్థానంలో ఇపుడు పిఏ గా ఉంటున్న అధికారి పనితీరు కూడా అలాగే ఉందట. దాంతో నేతల్లో బాలకృష్ణపై వ్యతిరేకత పెరిగిపోతోంది.
ఇటువంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గనుక పోటీ చేస్తే ఓటమి ఖాయమని బాగా ప్రచారం జరుగుతోంది. వైసిపి నేత, స్దానికుడైన నవీన్ నిశ్చల్ వైపు జనాల మొగ్గుందని సమాచారం. అదే సమయంలో టిడిపి స్ధానిక నేత అంబికా లక్ష్మీనారాయణ కూడా రేసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చేయకపోతే తనకు టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును అడుగుతున్నారు. ఇటు నవీన్ అటు అంబకా ఇద్దరూ స్ధానికులే కావటంతో ఇద్దరికీ నియోజకవర్గంలో పట్టుంది. వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు బదులు అంబికాకు టికెట్ ఇస్తే గెలుపు ఖయం అంటున్నారు పార్టీనేతలు. మరి బాలయ్య ఏమంటారో చూడాలి…?
