లోక్‌సభలో రోజు జరిగే డ్రామానే కొనసాగుతోంది. పార్లమెంట్‌లో ఎంపీలు నిరసన చేపట్టడం విధిలేని పరిస్థితుల్లో సభన వాయిదా వేయడం కొనసాగుతోంది. అవిశ్వాసంపై సభ వాయిదాపడటంతో టీడీపీ ఎంపీ తోటా నరశింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల గందరగోలంతో అవిశ్వాస తీర్మానం ప్రేవేశపెట్టడానికి ఈ రోజు కూడా సాధ్యం కాలేదు. తమ రాష్ట్రాల సమస్యలపై అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టడంతో సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించట్లేదంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.
అనంతరం పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీలు కేద్రంపై విమర్శలు గుప్పించారు. తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసును స్పీకర్ రద్దు చేశారని ఎంపీ తోట నర్సింహులు అన్నారు. సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు కనపడలేదని, రాజకీయ ఎత్తుగడతోనే ఇలా చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఆందోళన చేసే ఎంపీలను విరమింపజేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని అన్నారు ఎంపీ అవంతి శ్రీనివాస్ . ప్రభుత్వం భయపడే అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా ఇలా చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రతిరోజు ఇలాగే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
