Friday, May 3, 2024
- Advertisement -

బాబు వ్యూహం మామూలుగా లేదుగా…

- Advertisement -

ఏపీలో టీడీపీ పుల్‌జోష్‌లో ఉంది. నంద్యాల‌,కాకినాడ ఎన్నిక‌ల విజ‌యంతో బాబుతోపాటు పార్టీ శ్రేణుల్లో అత్మ‌విశ్వాసం తొణికిస‌లాడుతోంది. ఇదే ఊపుతో వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ద్వారా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించాల‌నుకుంటోంది. ఇప్ప‌టికె ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి టీడీపీలోకి ప‌లువురు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మేగాల‌మీద పూర్తి చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 175 సీట్లూ సాధించాలని బాబు టార్గెట్. ఎన్నిక‌ల‌నాటికి వీల‌యినంత వైసీపీని మాత్రం ఖాళీ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా ఉన్న నాయ‌కుల‌మీద దృష్టి సారించింది. ప్ర‌స్తుతానికి ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. తమతో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నా.. అందరినీ చేర్చుకునే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది.

అయితే ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రమే టీడీపీ ఎందుకు చేర్చుకోవాలనుకుంటుందోన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీని వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏపీలో 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 3, వైసీపీకి ఒక స్థానం దక్కుతాయి. ఒక్కో ఎంపీని ఎన్నుకోవడానికి 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పుడు వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేలున్నారు.

పార్టీకి 46 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఓ స్థానం వైసీపీకి సునాయాసంగా దక్కుతుంది. అయితే ఆ ఒక్క సీటును కూడా వైసీపీకి వెళ్లకుండా చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా చేయాలంటే వైసీపీలో 44 ఎమ్మెల్యేలకంటే తక్కువ ఉండేలా చూడాల‌ని బాబు వ్యూహాలు ప‌న్నుతున్నారు . అయితే ద్వితీయప్రాధాన్య ఓట్లు.. తదితర తలనొప్పులు ఉంటాయ‌నె ఉద్దేశ్యంతో ఏకంగా ఆరుగురిని లాగేసుకుంటే అప్పుడు వైసీపీ దగ్గర 40 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లే ఛాన్సే లేదు.

జ‌గ‌న్ లండ‌న్‌ణుంచి వ‌చ్చేలోపు వ‌ల‌స‌ల‌ను పూర్తి చేయాల‌ని బాబు భావిస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి వైసీపీని బ‌ల‌హీనం చేయ‌డానికి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. దానిలో భాగంగానె రాజ్య‌స‌భ సీటు ద‌క్కకుండా ఆరుగురిపై టీడీపీ కన్నేసింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం చేస్తారొ చూడాలి. అందుకే ఆ ఆరుగురిపై టీడీపీ కన్నేసింది. మరి వైసీపీ ఏం చేస్తుందో చూద్దాం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -