Sunday, May 12, 2024
- Advertisement -

మ‌రోసారి ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్దం కానున్న క‌ర్నూలు జిల్లా

- Advertisement -

ఏపీలో ఎక్క‌డ చూసినా ఉప ఎన్నిక వేడి వాతావ‌ర‌నం క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నంద్యాల ఉప ఎన్నిక‌కు ఉన్నంత ప్రాధాన్యం బ‌హూశ లేద‌నిపిస్తోంది.దీనికోసం చంద్ర‌బాబుతో సహా మంత్రులు,ఇత‌ర నాయ‌కులు అంద‌రూ అక్క‌డ‌నే మాకాం వేసి టీడీపీ గెలుపుకోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతే రీతిలో వైసీపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పార్టీ అధినేత జ‌గ‌న్ ఏకంగా 9వతేదీనుంచి 21 వ‌ర‌కు అక్క‌డ‌నె మ‌కాం వేయ‌నున్నారు.

తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కర్నూలు జిల్లా నేత శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తను విలువలకు కట్టుబడి ఉన్నాను అని పార్టీ మారినందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా చక్రపాణి రెడ్డి ప్రకటించారు.

ఇదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం పార్టీ నేతలుగా చలామణి అవుతున్న వారు ‘సిగ్గుంటే.. పదవులకు రాజీనామా చేయాలి..’ అని చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక టీవీ చర్చాకార్యక్రమంలో మరో నేత ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఆయనే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన బుడ్డా కొన్నాళ్ల కిందట తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు.

ఫిరాయించిన తర్వాత కూడా వైకాపా ద్వారా దక్కిన ఎమ్మెల్యే హోదాకు ఆయన రాజీనామా చేయలేదు. 21 మంది ఎమ్మెల్యేలు అలా ఫిరాయింపుకు పాల్పడటం వారిలో నలుగురు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులను తీసుకోవడం కూడా తెలిసిన సంగతే. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ రాజీనామా చేయలేదు. అయితే బుడ్డా మాత్రం ‘రాజీనామాకు సై’ అన్నారు. మరి ఈయన నిజంగానే రాజీనామా చేస్తే.. కర్నూలు జిల్లాలోనే మరో నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినట్టే. మ‌రి అంత స‌హాసం చేస్తారానేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -