- Advertisement -

వీరాభిమాని ఉతికేశాడు…… బట్టలిప్పి తన్నించుకోవడం, ఉరేసుకోవడాలు ఎప్పుడు?

- Advertisement -

సోషల్ మీడియాలో టిడిపి వీరాభిమానులు…….ఎపిలో టిడిపి నాయకులు, టిడిపి జెండా కోసమే బ్రతికున్నాం అని చెప్పుకునే నాయకులందరూ తెల్లబోయేలా చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల టిడిపి సీనియర్ నాయకుల నుంచి వీరాభిమానుల వరకూ అందరూ హతాశులను చేసింది. సంవత్సరాలుగా సోషల్ మీడియాలో టిడిపికి అండగా నిలిచిన చుండు సుధాకర్ అనే టిడిపి వీరాభిమాని ఆవేదన పరిస్థితికి అద్దం పడుతోంది. ఎన్నో విమర్శలను ఎదుర్కుంటూ టిడిపికి, చంద్రబాబుకు అండగా నిలిచిన ఆ అభిమాని తాజాగా చంద్రబాబుగారు రాహుల్ పంచన చేరిన వైనాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఏకంగా టిడిపికే గుడ్ బై చెప్పేశాడు.

ఇక కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే గుడ్డలూడదీసి తంతారు అన్న టిడిపి సీనియర్ నాయకులు, చంద్రబాబు కనుక కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ఉరేసుకుని ఛస్తా అని ఆవేశపడిన నాయకుల స్పందన కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే మాత్రం ఆ నాయకులందరూ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు రావడం విషయం పక్కనపెడితే, స్థానిక టిడిపి కార్యకర్తలను ఫేస్ చేయడానికి కూడా మొహం చెల్లడం లేదని సన్నిహితులతో వాపోతున్నారు. అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రుల చేతికి చిప్ప ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి సోనియాను గెలిపించండి అని ప్రచారం చేయడానికి చంద్రబాబుకు మనసు ఎలా వస్తోంది అని ఒక టిడిపి సీనియర్ నాయకుడే ప్రశ్నిస్తున్నాడు. జగన్‌పై జగనే దాడి చేయించుకున్నాడు అని తాను అనడంతో పాటు, పార్టీ నాయకుల చేత కూడా, భజన మీడియా చేత ప్రచారం చేయించిన చంద్రబాబు నిన్న సడన్‌గా ప్లేట్ ఫిరాయిస్తూ జగన్‌పైన జగనే దాడి చేయించుకున్నాడు అని నేను అనలేదని, అలా ఏ నాయకుడైనా ఎందుకు చేస్తాడని మీడియానే దబాయిస్తూ కొత్తగా మాట్లాడేశాడు. ఇక ఇలాంటి ఎన్నో యూటర్న్ విషయాలు ఇప్పుడు టిడిపి నాయకులకు, కార్యకర్తలకు కూడా చంద్రబాబు అంటే వ్యతిరేకత ఏర్పడేలా చేస్తున్నాయి. కావాలంటే టిడిపి వీరాభిమాని సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ మీరూ చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -