Friday, April 19, 2024
- Advertisement -

విశాఖ లో టీడీపీ చీటీ చిరిగిపోయినట్లేనా..?

- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వేలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటిఅప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ లోనే ఉన్నాడు.. వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది.

విశాఖ లో టీడీపీ కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఎదురయ్యింది. పార్టీ చెప్పినట్లు అమరావతి కి సై అందామా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకునేలా లేరు.. పోనీ ప్రజలు చెప్పినట్లు విశాఖ కే కట్టుబడి ఉందామా అంటే పార్టీ లో చోటు ఉండేలా లేదు.. చంద్రబాబు ఒత్తిడి తో వారు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటే వారు ఎంత తీవ్ర ఒత్తిడి లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. విశాఖ‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నలుగురు టీడీపీ తరపున తమ తమ ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్న వారే.. అయితే పార్టీ ఓటమి దగ్గరినుంచి పెద్దగా టీడీపీ తో సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నారట..

ఇప్పటికే విశాఖ లోని నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు వైసీపీ పంచన చేరిపోయారు. మరో ఇద్దరు మిణుకుమిణుకు మంటున్నారు.. ఇవాళో రేపో ఎదో ఒక పార్టీ కి వెళ్లిపోయి టీడీపీ చెర నుంచి తప్పిచుకుందామని అనుకుంటున్నారు.. ఈ క్రమంలో టీడీపీ అవసరం లేదని పక్కకు పెట్టిన నాయకులే ఇప్పుడు చంద్రబాబు కు దిక్కయ్యారని తెలుస్తుంది. మాజీ మంత్రిగంటా శ్రీనివాస‌రావు.. విజృంభిస్తార‌ని, ఆయ‌న దూకుడు పెంచుతార‌ని, పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని చంద్రబాబు భావించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న సైలెంట్ అయ్యారు. పోనీ..మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలైనా ఉన్నారు.. వారైనా పార్టీకి అండ‌గా ఉంటారు అనుకుంటారు.. వారిలో ఒక్క వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు మిన‌హా మిగిలిన ఇద్దరూ కూడా గంటా గ్రూపులో యాక్టివ్‌గా ఉన్నార‌నే ప్రచారం ఊపందుకుంది. పైగా వారు సైలెంట్ అయిపోయి.. వైసీపీకి లోపాయికారీగా స‌హ‌క‌రిస్తున్నార‌ని చంద్రబాబుకునివేదిక‌లు అందాయి. తాజాగా ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ సైకిల్ దిగేశారు. రేపోమాపో మ‌రో ఎమ్మెల్యే గ‌ణ‌బాబుది అదే దారి అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ లో చంద్రబాబు ఎలాంటి ఎత్తు వేస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -