Saturday, May 4, 2024
- Advertisement -

కాంగ్రెస్ : అక్కడ మేమే పోటీ చేస్తాం.. ఏపీ నేతకే చాన్స్..?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం కన్నా కూటమిగా వెళ్లి తెరాస ను ఢీకొట్టాలని ప్రధాన పార్టీలన్నీ ఫిక్స్ అయ్యి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్.. హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గంపై తీవ్రంగా పట్టుబడుతోంది. అదే కూకట్ పల్లి నియోజకవర్గం. ఇక్కడ సెటిలర్స్ ఓటర్లు అధికంగా ఉన్నారన్న కారణంగా ఈ సీటుపై కాంగ్రెస్ కన్నేసింది. ఇక్కడినుంచి ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఏలూరి రామచంద్రారెడ్డిని బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తోంది. సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం ఒక్క టికెట్ ఇచ్చిన క్రెడిట్ అయినా దక్కుతుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. పైగా వారి ఓట్లు మొత్తం సాలిడ్ గా పడతాయనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో బలంగా ఉంది.

సెటిలర్స్ కోసం కూకట్ పల్లినే ఎంచుకోవడం.. అదికూడా ఏపీ నేత ఏలూరిని పోటీకి నిలపడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందట.. ఇక్కడ ఏలూరి రామచంద్రారెడ్డికి రాజకీయంగా అందరితోను సత్సంబంధాలు ఉన్నాయి. పైగా ఉన్నత విద్యావంతుడు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఏఐసీసీ పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. దాంతో సాధారణంగానే ఆయనపై కొంత సానుకూల ప్రభావం ఉంది. అంతేకాకుండా ఏపీకి చెందిన కీలక నేతలు అందరు రామచంద్రారెడ్డికి కచ్చితంగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. దాంతో టీపీసీసీ కూడా ప్రత్యామ్నాయం ఆలోచించకుండా రామచంద్రారెడ్డికి పచ్చజెండా ఊపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -