తెలంగాణాలో టీడీపీ పరిస్థితి అంపవయ్యమీద ఉందనె చెప్పాలి. ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితలు ఎదుర్కోంటోంది. కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్‌కి బాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏపీలో వైసీపీనె లేకుండా చేయాలని దుష్టపన్నాగాలు వేసిని బాబుకు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. జగన్‌ను దెబ్బ తీయాలని బాబు ఎలా ప్లాన్ వేశారో అలాగె కేసీఆర్ వేసిన ప్లాన్‌కు ఆ పార్టీ సమాధి అవ్వడం ఖాయమనె వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణాలో ఆపార్టీ సమాధి అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్ళి వేడుకని వేదికగా మార్చుకున్నట్టున్నారనడంలో సందేహంలేదు. దాంతో తెలంగాణలో మిగిలిన కొద్దిమంది టీడీపీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నిజానికి, ఆ ఘటనతోనే ‘ఇక టీడీపీలో వుండడం దండగ’ అనే నిర్ణయానికి వచ్చేశారు తెలంగాణ టీడీపీ నేతలు. అందుకె ఎవరి దారి వారు చూసుకొనె పనిలో బిజీగా ఉన్నారు.
పరిటాల శ్రీరామ్ పెళ్ళికి కేసీఆర్ వెళ్ళడం తప్పేమీ కాదు. కానీ, అక్కడ కేసీఆర్ కేసీఆర్ వెలిగించిన చిచ్చు ఆ పార్టీని సమూలంగా నాశనం చేసె దిశగా తయారయ్యింది. ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో రహస్య మంతనాలు జరపడమే ఈ మొత్తం వివాదానికి కారణం. కేసీఆర్ – పయ్యావుల మధ్య ఏం జరిగిందో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే తెలియదు. అక్కడేం జరిగిందన్న విషయమై రకరకాల ఊహాగానాలు విన్పించాయి.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అయితే ఆ ఘటనతో షాక్‌కి గురయ్యారు. కాంగ్రెస్‌తో మంతనాలు షురూ చేశారాయన. ఆ మంతనాలు ఫలించాయనీ, రేపో మాపో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైపోయిందనీ ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి తనతోపాటు పలువురు టీడీపీ ముఖ్య నేతల్ని కాంగ్రెస్‌లోకి తీసుకెళ్ళనున్నారట. దీంతో ఇక పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
