Wednesday, May 8, 2024
- Advertisement -

దటీజ్ సీఎం జగన్..!

- Advertisement -

జగన్ అనే నేను.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవాంధ్య ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతోంది. 151 సీట్లతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించిన జగన్.. 30 ఏళ్లపాటు అధికారంలో ఉండటమే తన లక్ష్యమన్నారు. సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడిన ఆయన జనాల హృదయాలను గెలుచుకొని జననేతగా మారారు. ఏపిలో అప్పటి వరకు టీడీపీ పాలనపై ప్రజలకు విసుగెత్తిపోయింది. దాంతో పాలన మార్చే సమయం రాగానా వైఎస్ జగన్ కి పట్టం కట్టారు. అదే సమయంలో సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్నానన్న జగన్.. జనం కష్టాలను తీర్చడానికి ‘నవరత్నాలు’ తీసుకొచ్చారు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి.

ఇక దేశంలో ఏపి కి మంచి సముచిత స్థానం కూడా తీసుకు వస్తున్నారు సీఎం జగన్. ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తారు.. తన ఉనికి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా వరకు రోడ్లమీదకి వచ్చి ప్రచారం చేశారు. కానీ ఏపిలో మాత్రం అలా జరగలేదు.. రాష్ట్రంలో దాదాపు 13000 పై చిలుకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వైసీపీకి ఓటు వేయాలని ఒక్క అధికార పార్టీ నాయకులు రోడ్డు మీకు రాలేదు.. ఇక సీఎం అయితే తన పరిపాలనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే పంచాయతీలలో వైసీపీ 10 వేలకు పైగా గెలిచాయి.

ఇప్పుడు 75 మున్సిపాలిటీలకు, 12 కార్పోరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు ఎంతో కీలకం, పైగా మూడు రాజధానులు చెబుతున్న విశాఖ, విజయవాడ, కర్నూల్ లో ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. పైగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎక్కడ ప్రెస్ మీట్ లు పెట్టలేదు.. తమ పరిపాలన గురించి గొప్పలు చెప్పలేదు..తమకే ఓటు వేయాలని కోరలేదు.

కారణం తన పరిపాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని.. మంచి పాలన కోరేవారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికే తెలుస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక్క రోడ్ షో లేదు, బహిరంగ సభ లేదు.. తన పరిపాలన ద్వారా ప్రజలు చేయాల్సిన మంచి చేశాను.. అనే నమ్మకం సీఎం జగన్ కి ఉంది. అందుకే ఏపి ప్రజలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా దటీజ్ సీఎం జగన్ అంటున్నారు.

పీఆర్సీ ఎప్పుడు ఇస్తారంటే..!

‘సారంగ దరియా’ వివాదం.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?

అక్కడ కొల్లు అరెస్ట్.. ఇక్కడ బాబోరు .. లోకేశం అరుపులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -