Friday, March 29, 2024
- Advertisement -

తిరుపతిలో టీడీపీకి జనసేన షాక్‌!

- Advertisement -

తిరుపతి ఉప పోరులో విజేత ఎవరన్నది బహిరంగ రహస్యమే. అయితే, ఇక్కడ గెలుపోటముల సమస్య కంటే, 2024ను టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ-జనసేన మిత్ర పక్షానికి… భవిష్యత్‌పై ఓ అంచనాకు వచ్చేందుకు ఈ ఎన్నిక దోహదపడుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీలో అత్యధికంగా ఓట్లు సాధించేందుకు బీజేపీ-జనసేన పూర్తి స్తాయిలో నిమగ్నమయ్యాయి. తిరుపతి ఎంపీ స్థానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేక మార్చిలో ఉప ఎన్నకలు జరిగే అవకాశాలున్నాయి. అక్కడ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ వేడి మొదలైంది. మరీ ముఖ్యంగా తిరుపతికి బీజేపీ అగ్రనేతల రాక ఎక్కువైంది. దీన్ని బట్టి తిరుపతి ఉప ఎన్నికను ఆ పార్టీ ఎంత సవాల్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఓట్ల విషయానికి వస్తే బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి అసెంబ్లీ పరిధిలో సంప్రదాయ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన పార్టీ బలం కులమే. పవన్‌ సామాజికపరమైన కాపులు తిరుపతి అసెంబ్లీ పరిధిలో గెలుపోటములను శాసిస్తారనేది నిజం . 2009లో పవన్‌ అన్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతిలో రెండు చోట్ల పోటీ చేశారు. చిరంజీవికి ఏ మాత్రం సంబంధం లేని తిరుపతి ఆయనకు గెలుపునకు బహుమతిగా అందిస్తే, పుట్టిపెరిగిన ప్రాంతమైన పాలకొల్లు తిరస్కరించింది.

తిరుపతిలో కేవలం సామాజిక వర్గం వల్లే చిరంజీవి గెలిచారని చెప్పక తప్పదు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డిపై 41,529 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు వస్తే వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌ తన సమీప అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,28,376 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థి డాక్టర్‌ దగ్గుమాటి శ్రీమరిరావుకు జనసేన మద్దతు ఇచ్చింది. ఆయన 20,971 ఓట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఇక్కడో ట్విస్టు ఉంది. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం మినహాయించి మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కి భారీ మెజారిటీ వచ్చింది.

తిరుపతి అసెంబ్లీ పరిధిలో మాత్రం 3500 ఓట్లు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి రావడం గమనార్హం. ఇదే అసెంబ్లీ ఎన్నిక విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి భూమన గెలుపొందడానికి పరిగణలోకి తీసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి 12 వేల ఓట్లు పైచిలుకు సాధిస్తే.. పార్లమెంట్‌ ఎన్నిక ఎన్నికలకు వచ్చే సరికి కేవలం 20,971 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే జనసేన నేరుగా పోటీ చేయలేకపోతే కాపులు టీడీపీకి మద్దతు ఇస్తారని గత ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ-జనసేన పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలడడటం టీడీపీకి కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విష్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -