Friday, April 19, 2024
- Advertisement -

తొలి రోజు మొత్తం 1.91 లక్షల మందికే కరోనా!

- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రక్రియ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వీక్షించారు. గత ఏడాది కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. అప్పటి నుంచి వ్యాక్సిన్ తయారీ కోసం పలు దేశాలు కసరత్తు చేశారు.

ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ వచ్చింది. భారత్ లో పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ తొలి టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఈ కార్యక్రమం మొదలైంది. 

వాస్తవానికి 3 వేల సెంటర్ల నుంచి 3 లక్షల మందికి తొలి రోజున వ్యాక్సిన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా, దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి టీకాను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. తొలిరోజు కరోనా డ్రైవ్ విజయవంతం అయిందని తెలిపాయి. అయితే, ప్రభుత్వ లక్ష్యాన్ని, టీకా గణాంకాలను పరిశీలిస్తే, లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్టేనని ఆరోగ్య శాఖ నిపుణులు వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -