- Advertisement -

భాజాపా పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడిగా సోమువీర్రాజును నియ‌మించే అవ‌కాశం…

- Advertisement -

కేంద్ర‌మంత్రిగా ఉన్న ఉన్న వెక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌దివికి ఎంపిక కావ‌డంతో రాష్ట్రంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.2019 ఎన్నిక‌ల్లో త‌మ ప్లాన్ అమ‌లు చేసేందుకు కేంద్ర నాయ‌క‌త్వం సిద్ద‌మ‌వుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడి నియామ‌క విష‌యంలో వెంక‌య్య‌నాయుడే ప్ర‌ధాన అడ్డంకి అనే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.కాని ఇప్పుడు ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపిస్తోంది.
ఇంత వరకురాష్ట్ర కమిటీ మీద వెంకయ్య ప్రభావం తీవ్రంగా ఉండేది. ఆయనతో సంప్రదించకుండా ఏపని జరిగేది కాదు. అలాగే ఆయన అనుమతి లేకుండా ఏ నియామకాలు జరిగే వి కాదు. ఇపుడు ఆయన ఉప రాష్ట్రపతి అవుతూ ఉండటంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆమిత్ షా- రామ్ మాదవ్ అజండా అమలుజరగుతుందని చెబుతున్నారు
ఇందులో భాగంగా ఎపుడు రాష్ట్రకమిటీ అధ్యక్షుడిగా ఉన్న కంభ ం పాటి హరిబాబును ఆ పదవి నుంచి తప్పించి ఆయనను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయాన్ని బిజెపి అధిష్టానం యోచిస్తున్నది. ఇపుడు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నందున రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతూఉందని, ఇపుడు ఆయన ఉప రాష్ట్రపతి కావడంతో రాష్ట్రానికి నష్టం అనే అభిప్రాయం ఒక సెక్షన్ లో బలంగా ఉంది. అందువల్ల ఈ విషయంలో అలాంటి అపోహలు తొలగించేందుకు హరిబాబు ను కేంద్ర క్యాబినెట్ లో కి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని సీనియర్ నాయ‌కులు చెప్పిన‌ట్లు స‌మాచారం.
కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి హ‌రిబాబును తీసుకుంటె ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. ఈ పదవిని పార్టీ ఎంపి సోము వీర్రాజును అప్పచెబుతారు. నిజానికి సోము వీర్రాజు పేరు ఎపుడో ఖరారయింది. అయితే, చంద్రబాబు విమర్శకుడి పేరున్న సోమూవీర్రాజును పార్టీ అధ్యక్షుడిని చేస్తే బిజెపి-టిడిపి సంబంధాలు చెడిపోతాయని వెంక్కయనాయుడు వాదించి ఈ నియామం వాయిదా వేయించారని చెబుతారు.
ఫలితంగా రాష్ట్ర కమిటీకి చంద్రబాబు మిత్ర బృందం నాయకత్వమే కంటిన్యూ అయింది.ఎపుడో టర్మ్ అయిపోయినా ప్రొఫెసర్ హరిబాబు అధ్యక్షుడిగా కొనిసాగారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో భాజాపా స్వ‌రూపం మారిపోతుంద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -