Tuesday, April 23, 2024
- Advertisement -

టీడీపీ, వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ

- Advertisement -

మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహరం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది. తన పర్యటనకు ప్రజల్లో వస్తున్న స్పందన అధికార పార్టీ నేతల్లో భయం పుట్టిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాంతో వక్ర రాజకీయాలకు దిగుతోందని మండిపడ్డారు. నారాయణ అరెస్టును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు.

అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రశ్నా పత్రాల వెనుక నారాయణ విద్యాసంస్థల ఉద్యోగుల హస్తముందన్నారు. దోషులెవరైనా శిక్ష తప్పదన్నారు. తిరుపతిలో అరెస్టు అయిన ప్రిన్సిపల్ వాంగ్మూలంతోనే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామని మరో మంత్రి అంబడి రాంబాబు తెలిపారు.

విద్యా, వైద్య రంగాల్లో చెడుగు మొగ్గలోనే తుంచేయకంటే భవిష్యత్ తరాలపై ప్రభావం పడుతుందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జలు. ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులను పట్టుకున్నారన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలోనూ ఈ విషయం స్పష్టమైదన్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య చిచ్చురేపుతోంది.

మంత్రిపై భూకబ్జా ఆరోపణలు

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా ?

కమ్మ మంత్రులపై కుట్రలు

-Anjanreddy Kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -