మంత్రిపై భూకబ్జా ఆరోపణలు

- Advertisement -

ఇటీవల జరిగిన ఏపీ మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో మరోసారి పదవి దక్కించుకున్న ఆదిమూలపు సురేష్‌ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ తన పొలం ఆక్రమించారంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించడం పరిపాటి.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ కలెక్టర్ ఎదుట తన గోడు విన్నవిందుకుంది. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. ఆదిమూలపు సురేష్‌కు చెందిన జార్జ్ ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో తమకు మూడెకరాల భూమి ఉందనీ.. దాన్ని ఆయన ఆక్రమించారని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

- Advertisement -

ఎంతో మందికి తాను ఫిర్యాదు చేసినా ఫలితం లేదనీ.. మీరైనా న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకుంది. మంత్రి సురేష్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రకాశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా ?

బీజేపీకి సుమలత మూడు షరతులు

కాంగ్రెస్ కు పీకే ఊహించని షాక్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -