Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా ?

- Advertisement -

ఏపీలో పొత్తల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మళ్లీ కూటమి కడతాయా అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 2014లో జోడి కట్టి ఎన్నికలకు వెళ్లినట్టే మరోసారి.. జనసేనానితో టీడీపీ అధినేత చేయి కలుపుతారా అన్నది ప్రధాన చర్చనీయాంశమైంది. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

మరోవైపు చంద్రబాబు సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. దాంతో జనసేన, టీడీపీ పొత్త ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుపై వారినే అడగాలన్నారు. పవన్‌ కల్యాణ్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించడంతో సోము స్పందించారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు.

2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీ మంత్రి పదవులు పంచుకున్నాయి. అయితే రాష్ట్ర విజభన తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో 2017లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చింది. ప్రస్తుతం బీజేపీతోనే జనసేన పొత్తు కొనసాగుతోంది. తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మూడు పార్టీలు మరోసారి పొత్త కడతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -