Friday, April 19, 2024
- Advertisement -

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

- Advertisement -

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం. తర్వాత రాష్ట్రా రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి. వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర.. అనుమతించని కాంగ్రెస్ అధిష్టానం.. లోకసభ సభ్యత్వానికి రాజీనామా… కొత్త పార్టీని స్థాపించారు.

2011 మార్చి 11 న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించి.. తల్లి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు నియమించారు. ఇక ఉపఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొంది అందరినొళ్ళకు తాళం వేశారు. 2011 లోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన.. 2014 సార్వత్రిక ఎన్నికలలో అతిస్వల్ప ఓట్ల శాతం తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ఎన్నిలలో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోవడం.. విభజన హామీలు.. ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం.. తన పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పసువులు కొన్నట్టు కొనటం.. వంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ.. 2017 నవంబరు 16 న ప్రజాసంకల్పయాత్ర చెపట్టి 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల బాధలను తెలిసుకొని ప్రజలకు మరింత దగ్గర అయ్యారు.

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలకుగాను 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక అప్పటినుంచి ప్రజా సేవే ద్యేయంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నేరవెరుస్తు.. మరో పక్క రాష్ట్ర అభివృద్దిపై పోకస్ పెడుతు ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదే వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత అతనే..? 2019 ఎన్నికల ముందు వరకు రాజకీయాల్లో చక్రం తిప్పుతూ.. బిజిబిజిగా వైసీపీలో కీలకనేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019 ఎంపీ సీటు దక్కక పోవడంతో కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు. తర్వాత రాజ‌కీయాల‌తో సంబంధం లేని టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని దక్కించుకున్నారు వైవీ సుబ్బారెడ్డి.

అయితే 2019 ఎన్నికల్లో తూర్పు గోదావ‌రి జిల్లా కు ఇంచార్జ్‌గా ఉన్నా ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా వ్య‌వ‌హారాల‌ను కూడా ఆయ‌నే చూస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ద్వారంపూడి మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు బోస్‌పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి గటన మరోక్కట్టి గుంటూరులోనూ చోటు చేసుకుందట. ఈ విషయాలపై సీరియ‌స్‌గా ఉన్నా జగన్ ఇలాంటి విష‌య‌లు వైవి సుబ్బారెడ్డికి ఎందుకు చెప్ప‌లేద‌ని ఫైర్ అయినట్టు సమాచారం. అంటే పైకి టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్నా పార్టీలో జగన్ తర్వాత వైవి సుబ్బారెడ్డె చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -