తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

- Advertisement -

ఆంద్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మృతితో అక్కడ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ బంపర్ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీని ఓడించారు.

అయితే టీడీపీ మళ్ళీ పనబాక లక్ష్మీనే బరిలోదించింది. తెలంగాణ దుబ్బాక ఎన్నికల ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో ఊపు మీద ఉన్న బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని దూకుడు పెంచింది. మరో వైపు అధికార పార్టీ వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని బరిలో దించబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికి ఇక్కడ పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మద్యనే ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది. గత ఏడాదిన్నర లో అభివృద్ధి కన్న.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మొదటి గా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టారు. ఇక అభివృద్ధి పై దృష్టి పెట్టాలనుకున్న సీఎం జగన్ కు కరోనా ఆటంకం కలిగించింది. ఇక తిరుపతి ఉపఎన్నిక పై అభివృద్ధి ప్రభావం చూపనుందా..? ఒక వెళ తిరుపతి ప్రజలు గనక అలా ఆలోచిస్తే ఇక్కడ టీడీపీ ప్లస్ అయ్యో అవకాశం లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. కాని అతితక్కువ సమయం.. అందులోను కరోనా.. ఇవాన్ని పరిగణింస్తూ.. ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వార లబ్ది పొందిన ఓటర్లు మాత్రం వైసీపీ వైపే మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షర్మిలా ను కలసిన రోజా.. ఎందుకు?

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...