Thursday, April 25, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పొలిటిక‌ల్ లీగ్‌ 2019 విజేత ఎవ‌రంటే…?

- Advertisement -

ఏపీపీఎల్_ 2019 విజేత ఎవ‌రు…? ఏ న‌లుగురు క‌లిసినా విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ విజేత‌గా నిలుస్తుందా….ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందా అనేదానిపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. 2019 ఏపీపీఎల్ విజేత‌గా ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రినా….యువ‌నేత జ‌గ‌న్ నిలుస్తాడా అనేదానిపై ప్ర‌జ‌ల్లో స్ప‌స్ట‌త క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పొలిటిక‌ల్ లీగ్ (ఏపీపీఎల్)_2019 విజ‌త ఎవ‌రు అనేదానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపిలో ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టి ఓటింగ్ న‌మోదు ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు చేర్చింది. అలాగే పోలింగ్ కు అవ‌స‌ర‌మైన ఈవిఎంలు….వివిప్యాట్ లు ద‌శ‌ల వారీగా తెప్పించే ప‌ని మొద‌లు పెట్టింది. దీంతో ఎన్నిక‌ల వేడి పూర్తిస్థాయిలో రాజుకుంటోంది. దీనికి త‌గ్గ‌టే అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతూ ప్ర‌జ‌ల్లో పేరుండ‌టంతోపాటు ధ‌న బ‌లాన్ని అంచ‌నా వేసి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిలో త‌ల‌మున‌కలై ఉన్నాయి. అయితే 2014లో కొద్దిపాటి తేడాతో ప్ర‌తిప‌క్షాన్ని వెనక్కు నెట్టి అధికారాన్ని చేజిక్కుంచుకున్న తెలుగుదేశం పార్టీ 2019లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాల‌ని ప‌క‌డ్భందీగా ముందు కెల్తోంది. అయితే కొన్ని ప‌రిస్థిలు అందుకు భిన్నంగా క‌నిపిస్తున్నాయి.

2004, 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచితీరాల‌ని అమ‌లు కాని హామీలును ప్ర‌క‌టించింది. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరును చూసి భ‌య‌ప‌డ్డ చంద్ర‌బాబు నాయుడు బిజేపితో పొత్తు పెట్టుకోవ‌డంతోపాటు అప్పుడే పార్టీని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ ను త‌న‌వైపు తిప్పుకుని ప్రచారం నిర్వ‌హించ‌డంతో ఒక‌టిన్న‌ర శాతం ఓట్ల తేడాతో ఆధిక్యం సాధించి అధికారాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

నాలుగున్న‌ర ఏళ్ళు అవుతున్నా ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు చేసిన ఐదు సంతకాల పూర్తిస్థాయిలో అమ‌లు కాలేదు. మొద‌టి సంత‌క‌మైన రైతు రుణ‌మాఫి తీరును ప‌రిశీలిస్తే ఆ పార్టీ ఇచ్చిన ఆరువంద‌ల హామీల సంగ‌తి ఏగ‌తిన ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. రైతు రుణ‌మాఫీ ఐదు ద‌శ‌ల్లో అమ‌లు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని గ‌ద్దెనెక్కాక మాట‌మార్చినా ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కంతులు మాత్ర‌మే రైతుల‌కు అందాయి. ఇంకా రెండు కంతులు రైతుల‌కు అందాల్సి ఉంది. లోటు బ‌డ్జెట్ తో ఉన్నా రైతు రుణ‌మాఫి చేసిన ఘ‌న‌త త‌న‌దే అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడు అండ్ కో ది. దీనికి త‌న అనుకూల మీడియా మసిపూసి మారేడికాయ చేయ‌డంలో త‌న వంతు పాత్ర పోసిస్తున్నా రైత‌న్న‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంది.

ఇక కులాల వారీగా ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టి నెర‌వేర్చక పోవ‌డంతో ఆ వ‌ర్గాల్లోనూ వ్య‌తిరేక‌త టిడిపి ఎదుర్కొంటోంది. కాపు రిజ‌ర్వేస‌న్ కు సంబంధించి నియ‌మించిన కమిస‌న్ ఛైర్మ‌న్ నివేదిక తీసుకోకుండా మెంబ‌ర్స్ తో నివేదిక తీసుకుని అంసెబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. అలాగే బోయ‌ల‌ను ఎస్టీల్లో, ర‌జ‌కుల‌ను ఎస్సీల్లో చేరుస్తామ‌న్న హామీ అట‌కెక్కింది. దీంతో చివ‌ర‌కు త‌న 2014 మ్యానిఫెస్టోను వెబ్ సైట్ నుంచి టిడిపి తొల‌గించుకుంది.

వీటికి తోడు అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభ‌జించ‌డంతో కోలుకోవాలంటే ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించి బిజేపి నోట‌ ప‌లికించిన చంద్ర‌బాబు నాయుడు త‌రువాత కేంద్రంతో త‌న వ‌ర్గ ప్ర‌యోజ‌నాలుకు ప్రాధాన్య‌త ఇచ్చి హోదా ను ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు కేంద్రం ప్ర‌త్యేక హోదాకు త‌గ్గ‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజి ఇస్తామంటే అర్థ‌రాత్రి క‌ళ్ళుకాచేలా ఎదురుచూసి అర్థ‌రాత్రి స్వాగ‌తించారు సీఎం చంద్ర‌బాబు. కేంద్రంలోని బిజేపిపై వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లుతోంద‌ని అంచ‌నా వేసి ఈ ఏడాది మార్చిలో పొత్తు ధ‌ర్మాని పాటించ‌కుండా త‌ప్ప‌కుని ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మంటూ చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతూ కేంద్రం రాష్ట్రానికి సాయం చేయ‌కుండా మోసం చేసిందంటూ ధ‌ర్మ‌పోరాట స‌భ‌ల‌తో ప్ర‌జ‌ల‌కు త‌న దార్శినిక‌త‌….తెగింపు….అంటూ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తున్నారు. ఇంత‌టితో ఊరుకున్నారా అంటే అదీ లేదు…బిజేపియేత‌ర పార్టీల‌ను ఏకం చేసి 2019లో బిజేపిని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానంటూ ఇప్ప‌టికే యూపియే లో కూట‌మి పార్టీ నేత‌ల‌తో విందు భేటిలు సాగిస్తున్నారు.

దీంతో రాష్ట్రంలో పాల‌న కేంద్రంపై దాడి….తెలుగోడి ద‌మ్మ అన్న‌ట్లు సాగ‌దీస్తూ త‌న వ‌ర్గ ప్ర‌యోజ‌నాల‌ను మాత్ర‌మే నెర‌వేర్చుకుంటూ కేంద్రంపై పోరాట యోధుడుగా నిలిచే ప‌నిలో చంద్ర‌బాబు ఉంటే ప్ర‌జ‌లు మాత్రం మ‌రో విధంగా యోచిస్తున్నారు. దీంతో ఏపిఎల్ పోటీలో టిడిపి విజేతగా నిల‌వ‌డం అసంభ‌వ‌మ‌నే మాట ప్ర‌తినోట వినిపిస్తోంది. ఎందు కంటే ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త మ‌వుతోంది. ఇప్ప‌టికే అనేక జాతీయ స‌ర్వేలు కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. జాతీయ స‌ర్వేలు జ‌గ‌న్‌కు జై కొడుతుంటే ..బాబు అస్తాన స‌ర్వేలు మాత్రం టీడీపీపై 70 శాతం ప్ర‌జ‌లు సంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారంటూ సొంత డ‌బ్బా కొట్టుకుంటోంది.

అయితే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మిని త‌ట్టుకుని పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డుపుతూ గ‌త ఏడాది న‌వంబ‌ర్ 12 న ఇడుపులపాయ‌లో పాద‌యాత్ర ప్రారంభించి జ‌గ‌న్ ఏ నాయకుడు పాద‌యాత్ర చేయ‌న‌న్ని కిలోమీట‌ర్లు చుట్టుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య నిలుస్తూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామి ఇస్తున్నారు. దీనికి తోడు న‌వ‌ర‌త్నాలు పేరిట ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టో ను ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లోకి త‌న కేడ‌ర్ ద్వారా బ‌లంగా తీసుకెళ్లుతున్నారు. దీనికి తోడు ప్ర‌త్యేక హోదా కోసం మొద‌టి నుంచి క‌ట్టుబ‌డ‌ట‌మే కాక త‌న ఎంపీల చేత రాజీనామా చేసి ఆమోదించుకోవ‌డంతో ప్ర‌జ‌ల్లో మాట కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా తెగిస్తార‌ని మరోసారి నిరూపించుకున్నారు.

అలాగే పార్టీనేత‌లు…కేడ‌ర్ తో వ్య‌వ‌హ‌రించే విధానంలోనూ తాను మారి ఎటువంటి అపోహ‌ల‌కు తావులేకుండా జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు అండ‌గా నిలిచిన రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ప‌ట్టు స‌డ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే కీల‌క‌మైన కృష్ణా,గుంటూరు…తూర్పు,ప‌శ్చిమ తోపాటు ఉత్త‌రాంధ్రా పై గురిపెట్టారు. కీల‌క‌మైన జిల్లాల్లో మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర నిర్వ‌హించి స్థానిక స‌మ‌స్య‌ల‌పై హామీలు ఇస్తూనే నాయ‌క‌త్వ మార్పిడి…శ్రేణుల్లో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పార్టీ కేడ‌ర్ పూర్థిస్థాయిలో ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి సిద్ధం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ లుగా ఉన్న వారిలో పేరున్నా టిడిపి ధ‌న‌బ‌లాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డే వారికే ప్రాధ‌న్య‌త ఇస్తూ ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌లేని వారికి న‌చ్చ‌చెబుతూ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌వెంట‌నే న్యాయం చేస్తామ‌న్న భ‌రోసా ఇస్తుండ‌టంతో ఎక్కువ‌మంది స‌ర్థుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లోనూ ఒక‌సారి జ‌గ‌న్ కు అవ‌కాశం ఇచ్చిచూస్తే పోయేదేముంది అనే భావ‌న నెలకొంటోంది.

కాగా జ‌న‌సేన పార్టీ 2019 బరిలో నిలుస్తున్నా దాని ప్ర‌భావం కేవలం రెండు మూడు జిల్లాల‌కు ప‌రిమిత‌మైయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి తోడు సింగిల్ డిజిట్ స్థానాల్లోనే జ‌న‌సేన గెలిచే అవ‌కాశం మాత్ర‌మే ఉంద‌ని అంచ‌నా. అయినా జ‌న‌సేన చీల్చే ఓటు బ్యాంక్ పూర్తిగా తెలుగుదేశం పార్టీదే న‌ని రాజ‌కీయవ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇక‌పోతే బిజేపి…వామ‌ప‌క్షాలు బ‌రిలో ఉన్నా వీటి ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంచ‌నా.

అయితే అధికార తెలుగుదేశం పార్టీ త‌న వెంట 2014లో నిలిచిన బిజేపి…ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు లేక‌పోయే స‌రికి కాంగ్రెస్ తో ప‌య‌నించాల‌ని నిర్ణ‌యించి తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి పేరిట కాంగ్రెస్ తో జ‌ట్టుక‌ట్టింది. ఏపిలోనూ టిడిపి కాంగ్రెస్ తో క‌లిసి పోటి చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంట‌రిగా బ‌రిలో నిలవ‌నుంది. వామ‌ప‌క్షాలు ప్రస్తుతానికి జ‌న‌సేన వైపు ఉన్నా ఎన్నిక‌ల‌నాటికి ఈ బంధం ఉంటుందో లేదో అన్న అనుమానం వ్య‌క్త‌మౌతోంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌సారి ఒంటిపోరని మ‌రోసారి వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలో ఉంటాన‌ని అంటుండ‌టంతో అయోమ‌యాల‌కు దారితీస్తోంది. దీంతో సింగిల్ గా గెలిచిన చ‌రిత్ర లేని చంద్ర‌బాబు యువ‌నేత జ‌గ‌న్ ప్ర‌జాబ‌లం ముందు ఓట‌మిని చ‌విచూడ‌టం ఖాయ‌మ‌ని రాజ‌కీయప‌రిశీల‌కులు అంటున్నారు. దీంతో ఏపీపీఎల్ _2019 విజేత‌గా వైఎస్సార్ కాంగ్రెస్ నిల‌వ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -