Friday, March 29, 2024
- Advertisement -

విజయ సాయి రెడ్డి పై అందరు వ్యతిరేకం అవుతున్నారేంటి..?

- Advertisement -

వైసీపీ పార్టీ లో కీలక నేత, జగన్ తర్వాత అంతటి నాయకుడు ఎవరు అంటే విజయ్ సాయి రెడ్డి అనే చెప్పాలి.. జగన్ కి ఆప్తుడు అయిన విజయ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర లో పార్టీ బలోపేతానికి కీలకంగా వ్యవహరిస్తున్నాడు.. ఆయన పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలన్నీ విశాఖ సమస్యలు, అభివృధ్ధి గురించే. ఆయన విశాఖలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు. ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖకే వస్తారు. నెల్లూరు పెద్దాయన గా పేరున్న విజయ సాయి రెడ్డి కి విశాఖ లోకల్ అయిందని చెప్పాలి..  అయితే అక్కడి లోకల్ లీడర్స్ విజయ సాయి మీద ఇదే అంశం మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఒక నాన్ లోకల్ వచ్చి తమపై పెత్తనం చెలాయించేది ఏంటి అనేది వారి వాదన..

గత కొన్ని రోజులుగా విజయ సాయి రెడ్డి మీద చాలామంది వైసీపీ నేతలు కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.. జగన్ ని ఎవరైనా కలవాలంటే తప్పకుండా తన పర్మిషన్ కావాల్సి వచ్చింది.. దాంతో తనకు నచ్చిన వారిని మాత్రమే కలవనిస్తూ ఇతరులను దూరం చేయడం కొంత వివాదానికి కారణమవుతుందని. కబ్జాలకు పాల్పడుతూ విశాఖవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని నిందలు వేస్తున్నారు. ఇలా వైసీపీ మీద, విజయసాయిరెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేలా అయ్యన్న తదితరులు ఒక పధకం విమర్శల జోరు పెంచుతున్నారు.

ఇక సబ్బం హరి విషయంలో విజయ్ సాయి రెడ్డి పాత్ర చాలానే ఉందని చెప్పొచ్చు.. అందుకే ఆయన విజయ్ సాయి మీద చాలా ఆరోపణలు చేశారు. ఎక్కడ నుంచో విశాఖ వచ్చి డ్యాన్సులు చేస్తే ఊరుకుంటామా అంటూ ఆయన కన్నెర్ర చేస్తున్నారు . అలాగే గంటా శ్రీనివాస్ రావు కూడా తనను పార్టీ లోకి రానివ్వకుండా చేస్తున్న సాయి రెడ్డి పై కొంత గుర్రు గా ఉన్నారు.. ఇక విశాఖ లో చాలామంది పేరున్న రాజకీయ నాయకులూ నాన్ లోకల్స్ అని చెప్పాలి.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నుంచి ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి విశాఖలో రాజకీయం చేస్తున్నారు. రెండు సార్లు విశాఖ ఎంపీగా గెలిచిన ఎంవీవీఎస్ మూర్తి కూడా పొరుగు జిల్లావారే. నాడు కనీసం ఈ మాటను కూడా అనడానికి భయపడే టీడీపీ పెద్దలు ఇపుడు విజయసాయి రెడ్డి మీద విరుచుకుపడుతున్నారంటే అందులో ఫక్త్ రాజకీయం తప్ప మరేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

విమర్శల విషయంలో చంద్రబాబు మితి మీరిపోతున్నాడా..?

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -