- Advertisement -

కెసిఆర్ , జగన్ లు కలిసి మోడీ కి షాక్ ఇచ్చేనా..?

- Advertisement -

ఎవరేమీ చెప్పినా జగన్ ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఉన్న జగన్, కేసీఆర్ ల మైత్రి ఇప్పుడు తగ్గిందని చెప్పొచ్చు.. ఎందుకంటే కలిసి చాలా రోజులవ్వడమే కాక నీటి విషయంలో ఇరు రాష్ట్రాలకు మొదలైన తగువు కొంత మనస్పర్ధలకు కూడా దారి తీసింది. దాంతో ఇరువురు కొంచెం ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారట.. గతంలో కలవడానికి కారణం వెతుక్కునే వీరు ఇప్పుడు కలవకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటు ఉంటున్నారట.. ఇక తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగే విషయంలో ఈ ఇద్దరు ఒక్కటవుతారని గతంలో పలుమార్లు చర్చించుకున్న వీరు ఇప్పుడు ఓ సమస్య పై ఒక్కటవుతార అని అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న.. 

ఇంతకీ విషయం ఏంటంటే బీజేపియేతర ముఖ్యమంత్రులు అందరు మోడీ పై కొంత ఆగ్రహంగా, అసహనంగా ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే.. ముఖ్యంగా కేసిఆర్ జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో మోడిపై త్వరలోనే ఓ ఉద్యమం లాంటిది చేయబోతున్నారట.. ఎందుకంటే జీఎస్టీ చట్టప్రకారం రాష్ట్రప్రభుత్వాలకు ఆదాయం తగ్గితే కేంద్రం ఆ తగ్గిన మొత్తన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలకు నష్టం వాటిల్లిందన్న సంగతి తెలిసిందే.. అందుకు తెలంగాణా కూడా మినహాయింపు కాదు.. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితరామన్ కరోనా ని యాక్ట్ అఫ్ గాడ్ గా పరిగణించి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా చేతులేత్తేసిండ్.. అప్పులు దీనికి ప్రత్యామ్నాయంగా తెలిపింది.. అయితే దీనిపై కేసిఆర్ కొంత అసహనం ఉన్నట్లు తెలుస్తుంది.. 

ముఖ్యంగా జీఎస్టీ పరిహారం కోసమే.. ఆయన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ములు కాబట్టి.. ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు. ఒక వేళ కేంద్రం వద్ద అప్పు తీసుకుంటే.. రాష్ట్రంపై భారం పెరగడమే తప్ప… అదనపు ప్రయోజనం ఉండదని అంటున్నారు.  అయితే ఈ విషయంలో జగన్ కూడా తోడై మోడీ పై ఒత్తిడి తెస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అసలే మోడీ తో ఎంతో సన్నిహితంగా ఉండే జగన్ తెలంగాణ సీఎంతో కలిసి పోరాడేందుకు కూడా సిద్ధం అవుతాడా లేడా అన్నది చూడాలి.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -