- Advertisement -

గాజువాక‌ నియోజ‌క వ‌ర్గంలో లాస్ట్ పంచ్ ఎవ‌రిదో ఆ కిక్కే వేర‌బ్బా..

- Advertisement -

ఏపీలో అధికారం కోసం వైసీపీ, టీడీపీ, జ‌నసేన పార్టీలు త‌మ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. అనేక స‌ర్వేల్లో వైసీపీదే అని అధికారం తేల‌డంతో బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి చూసుకుంటె స‌ర్వేల్లో చెప్పుకోత‌గ్గ ప్ర‌భావం చూప‌లేదు. ఇద‌లా ఉంటె ఇప్పుడు అంద‌రి చూపు గాజువాక నియోజ‌క వ‌ర్గంపైనె. ఎందుకంటె అక్క‌డ‌నుంచి ప‌వ‌న్ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ ప‌వ‌న్ గెలుపు ఖాయం అన్న సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం ఈ నియోజ‌క వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో అంత‌ర్గ‌తంగా ప‌వ‌న్‌కు బాబు స‌హ‌క‌రిస్తున్నార‌న్న‌ది తేట తెల్ల‌మ‌య్యింది. ఇప్పుడు ఈ నియోజ‌క వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు జ‌గ‌న్.

ప‌వ‌న్ గెలుపు ఖాయం అనుకున్న అభిమానుల‌కు జ‌గ‌న్ వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో ఇవ్వబోతున్న లాస్ట్ పంచ్ పవన్ అభిమానులకు కలవరం కలిగిస్తోంది. గెలుపు ఖాయం అనుకున్న ప‌వ‌న్ ఇక్క‌డ ఒక రోడ్ షోతో పాటు, ఓ సభ నిర్వహించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. పవన్ బిగ్ సెలిబ్రిటీ అయితే … వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి తన వరకు తానుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు

రాష్ట్రం అంత‌టా ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్ చ‌వ‌రిరోజు 9 న మాత్రం గాజువాక టూర్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీ హోర్డింగుల‌తో జోష్ మీదున్నారు. ఆరోజుతో ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌వుతుంది. పవన్ ‘గబ్బర్ సింగ్’ లోని డైలాగ్ ‘లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరబ్బా’ అనే డైలాగ్ ను పోలి ఉండే జగన్ సుడిగాలి పర్యటనతో భారీ మార్పులు చోటు చేసుకుంటాయ‌ని జ‌న‌సేన శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. అటు గబ్బర్ సింగ్, ఇటు వైపు జగన్ ఇలా ఇద్దరూ గాజువాకలో విజ‌యం నీదా నాదా అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నారు. మ‌రి గాజువాక ప్ర‌జ‌లు ఎవ‌రికి జై కొడ‌తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -