Wednesday, April 24, 2024
- Advertisement -

కుప్పం జగన్ అడ్డాగా మారుతుందా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీ సి‌ఎం వైఎస్ జగన్ వైఖరి చూస్తుంటే. కుప్పం నియోజిక వర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్..అందులో మొదటి స్థానం కుప్పం నియోజికవర్గమే ఉండాలంటూ వైసీపీ కార్య కర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నారు. అసలు చంద్రబాబు అడ్డాగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా పాతాలని జగన్ ఎందుకు పట్టుదలగా ఉన్నారు ? ఒకవేళ జగన్ ప్రయత్నాలు ఫలించిన చంద్రబాబుకు చెక్ పెట్టగలరా ? అసలు ఎప్పుడు లేని విధంగా కుప్పంపై జగన్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ? అనే ప్రశ్నలు ప్రతిఒక్కరికి ఎదురవుతున్నాయి. దీని వెనుకున్న జగన్ ప్రణాళిక ఏంటో విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం ఒకసారి చూద్దాం !

గత కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజికవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో ప్రత్యర్థుపై విజయం సాధిస్తున్నారు. కుప్పం నియోజిక వర్గం ప్రజలు కూడా టీడీపీ తప్పా.. వేరే ఇతర పార్టీవైపు చూడరనే భావన రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇస్తూ వైసీపీ కూడా కుప్పంలో సత్తా చాటింది. దీంతో కుప్పం ప్రజల్లో టీడీపీ పై ఉన్న అభిమానం సన్నగిల్లిందని, అందుకే ఆల్టర్నేట్ పార్టీగా వైసీపీ వైపు చూస్తున్నారనే భావన కుప్పం వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. అందుకే కుప్పంపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంచితే రాబోయే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి.. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా పోటీ చేసే కుప్పంలోనే.. చంద్రబాబును ఓటమిపాలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో టీడీపీ పనైపోయిందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపేందుకే జగన్..కుప్పం నియోజిక వర్గంపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇటీవల కుప్పం లోని వైసీపీ కార్యకర్తలతో సమావేశం అయిన జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. :” కుప్పం నియోజిక వర్గం కూడా తన సొంత నియోజికవర్గం లాంటిదేనని, ఎక్కడ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు జగన్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసే భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి సీటు కుప్పందే కావాలంటూ ” ఆయన అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే కుప్పంపై జగన్ ఏ స్థాయిలో పట్టుదలగా ఉన్నారో స్థాష్టంగా అర్థమౌతోంది. మరి జగన్ భావిస్తున్నట్లుగా చంద్రబాబు అడ్డాగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.

More Like This

టీడీపీ స్థానలే.. జగన్ టార్గెట్ ?

గోరంట్ల మాధవ్ పనైపోయిందా ?

వైసీపీకి మరో రెబల్ ఎమ్మెల్యే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -