గోరెంట్లకు సస్పెండ్ వార్నింగ్.. !

- Advertisement -

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆయన నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో గోరంట్ల మాధవ్ తీరుపై ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఆ విడియోపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన వివరణ ఇస్తూ ” తను జిమ్ లో ఉన్న వీడియో ను మార్ఫింగ్ చేసి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు.

విడియోలను మార్ఫింగ్ చేసి తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నేతలు మరియు ఎల్లో మీడియా కుట్రలు చేస్తోందని గోరంట్ల మండి పడ్డారు. దీనిపై ఏ విచారనాకైనా తాను సిద్దమేనని స్పష్టం చేశారు. చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు చింతకాయల విజయ్ తో పాటు మరో ఇద్దరిపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేశానని, ఎల్లో మీడియా పై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. అయితే గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్ పై వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది.

- Advertisement -

ఒకవేళ ఆ వీడియో మార్ఫింగ్ కాదని, ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని తేలితే.. పార్టీ పరంగా అతనిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిని పార్టీ సహించదని, వైసీపీ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవేనా ? కాదా అని తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read

టీడీపీ స్థానలే.. జగన్ టార్గెట్ ?

ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో.. జాగ్రత్త !

మోడీకి చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ మాస్టర్ ప్లాన్ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -