టీడీపీ స్థానలే.. జగన్ టార్గెట్ ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో సి‌ఎం జగన్ వచ్చే ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తూ.. వైసీపీ జెండా ఎగురవేయాలని టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్ ఇప్పటినుంచే రాష్ట్రంలోని అన్నీ నియోజిక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజిక వర్గంలోని ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు ” గడప గడపకు మన ప్రభుత్వం ” పేరుతో కార్యక్రమాన్ని రెండు నెలలను నుంచి వైసీపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రంలోని అన్నీ నియోజిక వర్గాల్లో యాక్టివ్ గా ఉండేలా చూస్తున్నారు. ” గడప గడపకు ప్రభుత్వం ” కార్యక్రమంలో ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్న.. వైసీపీ నేతలు మాత్రం యాక్టివ్ గా పాల్గొంటున్నారు..

ఇక ఇప్పటివరకు ఎమ్మేల్యేలు. ముఖ్య నేతలతోనే బేటీ అవుతూ పార్టీ స్థితిగతులు తెలుసుకున్న జగన్ ఇకపై క్షేత్ర స్థాయిలోని వైసీపీ కార్యకర్తలతో కూడా భేటీ అయ్యేందుకు సిద్దమయ్యారు. ఎందుకంటే వైసీపీ బలహీనంగా ఉన్న నియోజిక వర్గాలలో నేరుగా కార్య కర్తలతో భేటీ కావడం వల్ల వారిలో మరింత జోష్ పెరిగి పార్టీ కోసం యాక్టివ్ గా పని చేసే అవకాశం ఉంది. అందువల్లే సి‌ఎం జగన్ నేరుగా కార్యకర్తలతో బేటీ అయ్యే ప్రణాళిక వేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆగష్టు 4 చంద్రబాబు నియోజిక వర్గం అయిన కుప్పంలోని వైసీపీ కార్యకర్తలతో వైస్ జగన్ భేటీ కానున్నారు.

- Advertisement -

ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజిక వర్గంలో వైసీపీ పాగా వేయాలని ఎప్పటినుంచో వైఎస్ జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలను రాబట్టింది. ఇదే జోష్ ను కొనసాగిస్తూ అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. కేవలం కుప్పం మాత్రమే కాకుండా హిందూపురం, టెక్కలి, పాలకొల్లు, విశాఖా నార్త్, రజమండ్రి రూరల్ వంటి నియోజిక వర్గాలలో వైసీపీ బలం పెంచుకునేందుకు.. జగన్ గట్టిగానే ప్రణాళిక వేస్తున్నారు. అందులో భాగంగానే.. క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలతో సంవేశం అవుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మరి జగన్ వేస్తున్న ఈ ప్రణాళికలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

More Like This

జగన్, చంద్రబాబు కలుస్తారా.. సాధ్యమేనా ?

కాంగ్రెస్ కు మునుగోడు అగ్నిపరీక్ష !

బాబు తెలంగాణ వైపు చూస్తున్నారా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -