2019 ఎన్నికలకు వైసీపీ శంఖారావం పూరించింది. వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునే దిశగా వైసీపీ ఇప్పటి నుండె ప్రణాలికలను సిద్దం చేస్తోంది.దీనికోసం స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. సోమవారం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే పక్కా స్కెచ్ తోనే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. కాకపోతే అంతకన్నా ముందే తమ పార్టీకి రాబోయే ఓట్లెన్ని అన్న విషయాన్ని ఖచ్చితంగా భేరీజు వేసుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోన్నది అర్ధమైపోతోంది.
ఇంటంటికి వైఎస్సాఆర్ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ప్రతీ ఇంటికీ వెళ్లి సభ్యులను కలిసి పార్టీలో చేరాల్సిందిగా కోరుతారు. చేరదలచుకున్న వాళ్లకి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతుంది. అంటే వచ్చే ఎన్నికలకు ముందే వైసీపీలో ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారన్న విషయమై పార్టీకి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల ఎన్నికల్లో రాబోయే ఓట్లపై ఓ అంచనాకు రావచ్చన్నది బహుశా పార్టీ నాయకత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
ఆగస్టు 11 నుంచి 29 వరకు నవరత్నాల సభలు నిర్వహించనున్నారు.ప్లీనరీలో జగన్ ప్రకటించి 9పథకాలను ప్రజలల్లోకి వస్త్రుతంగా తీసుకెల్లనున్నారు.నవరత్నాల హామీల ప్రాధాన్యం గురించి ప్రజలకు వివరించాలని, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇంతకుముందు పార్టీ విడుదల చేసిన ప్రజాబ్యాలెట్ గురించి అడగాలని సూచించారు.
అక్టోబర్ 2 నుంచి 25 వరకు జరుగుతుందని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు పోలింగ్ బూత్ పరిధిలో సమావేశాలు పెట్టుకుని జగన్ పాదయాత్రపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 26 లేదా 27 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని.. ఈలోపు పైమూడు కార్యక్రమాలు పూర్తి కావాలన్నారు.
వైసీపీ వ్యూహం చూస్తుంటే 2019 ఎన్నికలైన తర్వాత తమకు వచ్చిన ఓట్లను లెక్కేసేకంటే, ఎన్నికలకు ముందే వైసీపీ రాబోయే ఓట్లపై ముందస్తు అంచనా వేసుకునేందుకే ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అందుకు ప్రశాంత్ కిషోర్ బృందం యధాశక్తి ప్రతీ నియోజకవర్గంలోనూ సహకారం అందిస్తుంది. దయాత్ర మొదలయ్యే నాటికే రాష్ట్రంలో వైసీపీ పరిస్ధితిపై జగన్ కు ఓ స్పష్టమైన లెక్కుంటుందన్నమాట.
https://www.youtube.com/watch?v=pzXC0MfaL94
