Thursday, April 25, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ పై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు!

- Advertisement -

గత కొంత కాలంగా తెలంగాణ సర్కార్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వైయస్ షర్మిల. ఇటీవల నిరుద్యోగుల విషయంలో తెలంగాణ నిర్లక్ష్యం వహిస్తుందని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆమెను బలవంతంగా పోలీసులు నిర్బంధించడంపై అసహనం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని టీ సర్కార్ పై పోరాడుతున్నారు.

తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల. సీఎం కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనాని కట్టడి చేయడానికి కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల తనదైన స్టైల్లో స్పందించారు. 2017లో 3,311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదని షర్మిల ఫైర్ అయ్యారు.

అర్హత సాధించిన వారిని పక్కన బెట్టి ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నారు.. ఇది ఎంత వరకు న్యాయం అన్నారు. ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -