- Advertisement -

మునుగోడు బరిలో వైఎస్ షర్మిల.. అవసరమా ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు రాజకీయాలు ఏ స్థాయిలో హిట్ పెంచుతున్నాయో అందరికీ తేలింసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా మునుగోడుపై గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు మునుగోడులో బహిరంగ సభలు నిర్వహిస్తూ పోలిటికల్ హీట్ నూ మరింత పెంచుతున్నాయి. ప్రధాన పార్టీల మద్య మునుగోడు ఉపఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోటీలోకి షర్మిల కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభావం చూపలంటే.. మునుగుడు ఉపఎన్నికల బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే ఆలోచనలో షర్మిల ఉన్నారట. ఎప్పటికే ఎవరిని బరిలో దించాలనే దానిపై పార్టీ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో ఎలాంటి ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని, డైరెక్ట్ గా సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించిన షర్మిల ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయత చూపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందువల్ల మునుగోడులో వైఎస్ అభిమానులు అధికంగానే ఉండే అవకాశం ఉంది. దాంతో షర్మిల కూడా బైపొల్ పోటీకి సై అన్నట్లు తెలుస్తోంది. మరి పోటీ గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. మునుగోడులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బరిలో దిగనుంది అనే వార్తలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. మరి మునుగోడు చుట్టూ ఉన్న రసవత్తరమైన పోరులో షర్మిల ఎవరిని బరిలో దించనుంది.. ఇతర పార్టీలకు ఎంతవరకు పోటీ ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read

ఉపయోగం మోడీకా.. బాబుకా ?

రాహుల్ మంచోడే కానీ ..

జగన్ దెబ్బతో లోకేష్ కు ఏది దిక్కు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -