Sunday, May 12, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌లో పార్టీ ప‌టిష్టంపై జ‌గ‌న్ దృష్టి…

- Advertisement -

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. ఏక‌కాలంలో రెండు ప‌నులు చ‌క్క‌బెడుతున్నారు. ప‌గ‌లంతా పాద‌యాత్ర‌తో బిజీగా ఉండ‌టం… రాత్రిళ్లు మాత్రం పార్టీ ప‌టిష్టంపై దృష్టి సారించారు. పాద‌యాత్ర‌లో ఆరోజు ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు, స్థానికి నేత‌లు, వివిధ మండ‌లాల‌నుంచి ప్ర‌ముఖులను జ‌గ‌న్ క‌లుస్తున్నారు. వారినుంచి స‌మాచారాం తెలుసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో వారితో మాట్లాడేటపుడు పార్టీకి నేతలు దగ్గర లేకుండా చూసుకుంటున్నారట.

పనిలో పనిగా నియోజకవర్గంలో దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి? తమ పార్టీ నేతల పనితీరు ఎలాగుంది? ప్రభుత్వ విధానం, సమస్యలు, పరిష్కారాలన్నింటినీ వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఎన్నికల గురించి కూడా వారితో మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

పాద‌యాత్ర ముగించిన త‌ర్వాత ఎక్క‌డైతె బ‌స చేస్తున్నారో అక్క‌డికి కూడా స్థానికంగా ఉన్న ప్ర‌ముఖులు వ‌స్తె వారినికూడా క‌లుస్తున్నారు. పీడ్ బ్యాక్ తీసుకున్న త‌ర్వాత పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌యి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ పై చ‌ర్చిస్తున్నారంట‌. అదే సమయంలో నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వైసీపీలోకి వచ్చే నేతలపై వాకాబు చేస్తున్నారట. ఎంఎల్ఏలుంటేనేమో ఫీడ్ బ్యాక్ ను వారికి అందిస్తూ వాటిపై వర్కవుట్ చేయమని, తాను మాట్లాడిన ప్రముఖులను కలవమని చెబుతున్నారు.

పనిలో పనిగా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కూడా దృష్టి పెడుతున్నారు. అందులో భాగమే ఇటీవలే 30 మందికి పార్టీలో పదోన్నతులు, కొత్తగా నియమించటం అందరికీ తెలిసిందే. నియోజకవర్గల్లో పార్టీని బలోపేతం చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యలను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలపైన కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. వారికి స్థానికంగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎలా ఉంది అనే విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతూ పార్టీ బ‌లోపేతంపై దృస్టిసారించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -