Sunday, May 12, 2024
- Advertisement -

1000 కి.మీ. పాద‌యాత్ర‌ను పూర్తిచేసిన జ‌న‌నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి…

- Advertisement -

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. 74వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద సోమవారం జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు.

పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లను చేరుకున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం వద్ద వైకాపా నేతలు ఇరవై అడుగుల స్థూపం ఒకటి ఏర్పాటు చేశారు. స్థూపాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు వెయ్యి కొబ్బరికాయలను కొట్టారు.

మొత్తం మూడు వేల కిలోమీటర్ల సుదూర పాదయాత్రను జగన్ గత ఏడాది నవంబర్ ఆరో తేదీన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ జగన్ పాదయాత్ర వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా సాగింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది.

యాత్రలో ఏమాత్రం అలసిపోని విధంగా ముందుకు సాగుతున్న జగన్… తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న విషయంతో స్పష్టంగా చెప్పడంతో పాటు ప్రస్తుతం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు. జగన్ మాటలకు జనం నుంచి మంచి రెస్పాన్సే వస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడికక్కడ జగన్ యాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె సమీపంలోనూ జగన్ యాత్రకు మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి.

జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక పాదయాత్రలు నిర్వహించారు వైకాపా నేతలు. వాటితో పాటు ఐదు మెట్రో నగరాల్లో, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో కూడా జగన్ అభిమానులు ప్రత్యేక పాదయాత్రలు నిర్వహించి.. సంఘీభావం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -