Sunday, May 5, 2024
- Advertisement -

పవన్ ప్రశ్నలకు సమాధానమేది ?

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై పవన్ చేసే విమర్శలు.. వైసీపీ నేతలకు గట్టి సవాల్ గానే నిలుస్తూ ఉంటాయి. ప్రశ్నించడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వేసే ప్రశ్నలకు సమాధానమే కరువైంది. జగన్ పరిపాలన విధానంపై పవన్ ఎన్నో మార్లు ప్రశ్నలు సంధించినప్పటికి వైసీపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం ఎప్పుడు రాలేదు. ఇక తాజాగా మరొకసారి జగన్ ప్రభుత్వంపై పవన్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు మరొకసారి పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి.

మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్.. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 న వికేంద్రీకరణ సాధనకై ” విశాఖ గర్జన ” ఏర్పాటు చేయనున్నారు వైసీపీ శ్రేణులు. దీనిపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో దేనికి గర్జన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ” విద్యుత్ ఛార్జీలు పెంచినందుకా ?, ఫీజ్ రియింబర్స్ మెంట్ చేయనందుకా ?, రోడ్లు వేయనందుకా ? చెత్తపై పన్ను విధించినందుకా ?.. ” అంటూ పవన్ ప్రశ్నలు సంధించారు. దీంతో పవన్ ప్రశ్నలపై వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

“దత్త తండ్రి చంద్రబాబు తరుపున.. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ మియావ్.. మియావ్ ” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యంగా స్పందించగా.. మరో మంత్రి అంబటి రాంబాబు కూడా తనదైన శైలిలో స్పందించారు.. ” ప్యాకేజ్ కోసం మొరిగే వాళ్ళకు గర్జన అర్థమౌతుందా ? ” అంటూ అంబటి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక పవన్ ట్విట్ల పై మంత్రి రోజా కూడా స్పందిస్తూ.. ” పవన్ కుంభకర్ణుడిలగా 6 నెలలు నిద్రపోయి, 6 నెలలు మెల్కొంటాడని, ప్రభుత్వంపై విచిత్రమైన ట్విట్లు చేస్తుంటాడని ” రోజా విమర్శలు చేశారు. అయితే పవన్ ప్రశ్నలపై స్పందించిన ఏ వైసీపీ నేత కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ప్రతి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, ముందు పవన్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -