- Advertisement -

ఎంపీలు ఎంత‌మంది ఉన్నాన్న‌ది ముఖ్యంకాదు..పార్ల‌మెంట్‌ను వ‌ణికించామాలేదా అన్న‌దే ముఖ్యం..రోజా

- Advertisement -

కేంద్ర‌ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న భాజాపా, వైసీపీ బాబుపై మాట‌ల దాడిని కొన‌సాగిస్తోంది. తాజాగా బాబుపై వైసీపీ ఎమ్మెల్యే విమ‌ర్శ‌లు చేశారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష ప్ర‌త్యేక‌హోదా వ‌చ్చే వ‌ర‌కు వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తార‌ని రోజా తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఐదు మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ… తమ అధినేత జగన్ ఆదేశాలతో పోరాడుతున్నామని తెలిపారు. ఎంత మంది ఉన్నాం అనేది పాయింట్ కాదని… పార్లమెంటును వణికించామా? లేదా? అనేదే ముఖ్యమని రోజా అన్నారు.

అవిశ్వాసం ద్వారా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ మానవహారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన మానవహారంలో రోజా పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -