Sunday, May 12, 2024
- Advertisement -

ఇదేనా నీ సంస్కారం ప‌వ‌న్‌..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని. రెండు,మూడు రోజులుగా ఇరు పార్టీల అధినేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో పోరాటం చేస్తుంటే…ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఎలాంటి పోరాటం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశ వ్యాప్తంగా తిరిగి ఇత‌ర పార్టీ మ‌ధ్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌నీసం ఢిల్లీ ముఖ‌మైనా చూశారాని మండిప‌డ్డారు.

చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేయకూడదన్న కనీస మానవత్వం లేకుండా వైఎస్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేయలేదా అని గుర్తు చేశారు. చ‌నిపోయిన వ్య‌క్తుల‌మీద విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌న్న ఇంకిత జ్ణాతం లేదాని ప్ర‌శ్నించారు. జగన్‌ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న జనసేన నేతలు…. మరి వైఎస్‌ కుటుంబానికి చెందిన ఒక మహిళపై ఎలాంటి మాటలు మాట్లాడారో తెలియదా అని ప్రశ్నించారు.

జనసేన నేతలతో వైఎస్‌ కుటుంబానికి చెందిన మహిళను కించపరిచి…. 48 గంటల తర్వాత పవన్‌ కల్యాణ్ ప్రకటన ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌న్నారు. ప్రతికూల పరిస్థితుల్లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మహిళలు గర్వించేలా చేసిన వ్యక్తిపై అసభ్యకరమైన విమర్శలు చేయించడం సిగ్గు చేట‌న్నారు.

ఉన్ని విష‌యాల గురించి మాట్లాడితే మీకే అంత భాదుంటే , రి ఒక మహిళ ఎంతగా బాధపడి ఉంటుందో తెలియదా అని పవన్‌ను ప్రశ్నించారు. నాలుగు సంవ‌త్సరాలు టీడీపీతో క‌ల‌సి ఉండి త‌ర్వాత ప‌క్క‌కు వ‌చ్చి ఇప్పుడు నీతులు చెప్ప‌డం దారున‌మ‌న్నారు. అధికారంలో ఉన్న టీడీపీని వ‌దిలేసి ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీనీ విమ‌ర్శించ‌డం సిగ్గుచేట‌న్నారు.

టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అధికారుల‌పై జ‌రుగుతున్న దాడులు, అవినీతి, అక్ర‌మాలు ప‌వ‌న్‌కు క‌నిపించ‌డంలేదా. మిత్ర‌ప‌క్షం టీడీపీతో నాలుగు సంవ‌త్సరాలు క‌ల‌సి ఉండి ఏ ఒక్క ప్ర‌జాస‌మ‌స్య‌నైనా తీర్చారా అని ప్ర‌శ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్, జగన్ బహిరంగ చర్చకు రావాలని పవన్ అంటున్నారని… కానీ జగన్ ఏరోజైనా అధికారంలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి అర్థం లేని సవాళ్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ చర్చకు రావాల్సిందే అంటే బహిరంగ చర్చకు పార్టీ తరపున తాను వస్తానని ఆళ్ల నాని స్పష్టం చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు జిల్లాకు ఏంచేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

జ‌న‌సేన‌కు ప‌ది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే వారినికూడా బాబు కొనేసే వార‌ని ప‌వ‌న్‌కు చుర‌క‌లంటించారు.అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడానికి ముందు ఏం జరిగిందో పవన్‌ కల్యాణ్‌కు తెలియదా అని అన్నారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలే అసెంబ్లీలో ఉంటే వారిని కూడా చంద్రబాబు కొనేసి తిరిగి పవన్ కల్యాణ్‌నే వారితో తిట్టించేవారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -