- Advertisement -

జ‌గ‌న్ లండ‌న్‌నుంచి వ‌స్తానె ముమూర్తం ఫిక్సా…? అయేమ‌యంలో చంద్ర‌బాబు..

- Advertisement -

రాష్ట్రంలో ఇప్పుడు ఎవ‌రు చ‌ర్చించుకున్నా…ఎవ‌రు మాట్లాడినా ఒకే టాపిక్‌. అదే చిరంజీవి రాజకీయ భ‌విష్య‌త్తు. మార్చితో రాజ్య‌స‌భ ప‌ద‌వి ముగియ‌డంతో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. రాజ‌కీయీల‌ను పూర్తిగా వ‌దిలేస్తారా లేకా వైసీపీలో చేరుతార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వైసీపీలోకి వెల్లేందుకె ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. దీనికోసం ఇప్ప‌టికె జ‌గ‌న్ విజ‌య‌సాయికి అప్ప‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఇప్పటికే చిరంజీవితో చర్చలు జరిపారనె వార్త‌లు వినిపిస్తున్నాయి.పార్టీలోకి వ‌స్తె త‌గిన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక మ‌రో సారి చిరుతో జ‌గ‌న్ నేరుగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఇప్ప‌టికె చిరు, జ‌గ‌న్‌ల‌భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడితే రెండు ఆప్స‌న్స్ ఉన్నాయి. టిడిపి, వైసిపిలు ఇప్పటికే ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నందున, పదవితో సరిపెట్టుకోవచ్చునని అంటున్నారు. లేదా నాగబాబు చెబుతున్నట్లుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు అండగా ఉండవచ్చునని చెబుతున్నారు.

చంద్ర‌బాబు కూడా టీడీపీలోకి చిరుని తీసుకురావాల‌ని పావులు క‌దుపుతున్నారు. ప‌వ‌న్ బాబుతో స‌ఖ్య‌తో ఉన్నాడు కాబ‌ట్టి చిరుకూడా పార్టీలోకి వ‌స్తార‌ని నుకుంటున్నారు. కాని ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో బాబు అయేమ‌యంలో ఉన్నారు.

మ‌రో వైపు జ‌గ‌న్ ప‌వ‌న్‌, చిరు మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని పీకె సూచించారు. ఒక వేల‌ సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైసిపి, టిడిపిలు ఇచ్చే పదవుల కంటే తమ్ముడి పార్టీకి మద్దతుగా నిలబడటానికే ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. జ‌గ‌న్ లండ‌న్ నుంచి వ‌చ్చిన త‌ర్వాతె వీట‌న్నింటికి తెర‌ప‌డ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -