Saturday, May 4, 2024
- Advertisement -

త్వ‌ర‌లో సాక్షిఛాన‌ల్ 2 ….సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

మీడియాను మేనేజ్ చేయ‌డంలో బాబును మించిన నేత ఎవ‌రూ లేరంటారు. తెలుగునాట దాదాపు 10కి పైగా చాన‌ల్లు టీడీపీకీ ఆస్థాన క‌వులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాబు పంది అంటె నంది అంటె నంది అన్న రీతిలో డప్పుకొడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వార్తా క‌థ‌నాల‌తో మ‌సిపూసి మారేడు కాయ చేయ‌డం అంద‌రికి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటి ప‌రిస్థితి కుడితో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది.

అస‌లు విష‌యానికి వ‌స్తె…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒ వెలుగు వెలిగిన కొన్ని ప‌త్రిక‌లు, ఛాన‌ల్లు ప్ర‌స్తుతం గ‌డ్డుప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. క‌నీసం జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నాయి. కాని ఎలాగో ఎన్నికల సీజన్ కావడంతో ఏవైనా నాలుగు రాళ్లు వెనకేసుకుని ఎన్నికల తర్వాత వీటిని క్లోజ్ చేసేద్దాం అన్నట్టుగా మీడియా సంస్థలు గత అయిదారు నెలలుగా నెట్టుకొస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. దాదాపు పదికిపైగా ఛానల్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతే నెట్టుకొస్తున్నాయి.

ఎన్నిక‌లు అయిపోవ‌డంతో జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న కొన్ని ఛాన‌ల్స్ అప్పుడే అమ్మ‌కానికి పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లో ఉన్న రాజ్ న్యూస్ ఛానల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చేసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తాద‌ని ఎన్నిక‌ల ముంది ఛాన‌ల్‌ను కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ లీజుకు తీసుకున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ ఐదేళ్లు చేసేదేమీ ఉండదు. ఇప్ప‌టికే దానిమీద కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టామ‌ని ఇక ఖ‌ర్చుపెట్టినా లాభం లేద‌ని వ‌ద‌లేశారు.

ఇద‌లా ఉంటె వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న సంకేతాల‌తో వైసిపి వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న విజయ‌సాయిరెడ్డి ఎంటర్ అయి రాజ్ న్యూస్ ఛానల్‌ను టేకోవర్ చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ప్రయత్నాలకు జగన్ సైతం ఓకే అన్న‌ట్లు తెలుస్తోంతి.త్వరలోనే సాక్షి ఛానల్ 2 మొదలు కాబోతున్నట్టు మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. రాజ్ న్యూస్ పేరు మారుస్తారా ? లేదా అదే పేరు మార్చి కంటిన్యూ చేస్తారా ? అన్నది చూడాలి.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీకీ ఒక‌టి కంటె ఎక్కువ ఛాన‌ల్లు ఉండాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాకా కొట్టటానికి ఇప్పటికే 10 ఛానళ్లు ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా ఆయన కలిపేసుకుంటారు. ఎందుకంటె మీడియా మేనేజ్ మెంట్‌లో దిట్ట‌కాబ‌ట్టి.

మీడియా మేనేజ్మెంట్‌లో దిట్ట అయిన చంద్రబాబును ఢీ కొట్టాలంటే వైసీపీకి మరో ఒకటి రెండు ఛానళ్లు అదనంగా ఉండటంలో తప్పులేదు. రేపటి ఎన్నికల్లో ఫలితాలు వైసిపికి అనుకూలంగా వస్తే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ విధానాలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది. బాబు భ‌జ‌న‌కు ఘాటైన కౌంట‌ర్లు ఉండేందుకు ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానెల్ వైసీపీ అండ్ కోకు మ‌రో అద‌న‌పు బ‌లం కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -