Friday, May 17, 2024
- Advertisement -

మారిన జ‌గ‌న్ …ఇదే సాక్ష్యం

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ నాయ‌త్వంలోని వైసీపీ 2019 ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక విజ‌యంతో మ‌రింత ఉత్సాహంతో సిద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ సీఎం అవ్వ‌డం కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల పేరుతో మ్యానిఫెస్టోని కూడా జ‌గ‌న్ ప్లీన‌రీలో ప్ర‌క‌టించ‌డం ద్వారా ఓ అడుగు ముందుకేశారు. ఇక ఇప్పుడు సీఎం ప‌ద‌వి కోసం ఓ యాగం కూడా ప్రారంభించ‌నున్నారు వైసీపీ నేత‌లు. అయితే దీని వెనుక ఓ పెద్ద వ్యూహం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ల తాతల నాడే క్రైస్తవాన్ని తీసుకుంది. వైఎస్ సీఎం అయిన త‌ర్వాత ఆయ‌న హిందూ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు.గ‌తంలో జ‌గ‌న్‌కూడా పెద్ద‌గా పాల్గొన్న దాక‌లాలు లేవు. అయితే ఈ మధ్యే జగన్ గుళ్లలో అడుగు పెడుతున్నారు. పూజలకు అటెండ్ అవుతున్నారు. క్రైస్తవుడైన జగన్ చర్చికి వెళ్లడం ఎన్నోసార్లు చూశాం. అయితే గుళ్లకు వెళ్లినట్లు మనం ఎక్కడా చూడలేం. అయితే ఈ మధ్య జగన్ గుళ్లకు వెళ్తున్నారు. శ్రీశైలం, సింహాచలం లాంటి ప్రదేశాలకు వెళ్లారు. స్వామీజీలను కలుస్తున్నారు. వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.
అక్టోబర్ లో ప్రారంభించనున్న పాదయాత్రను కూడా తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రారంభిస్తానని జగన్ ప్రకటించారు. ఈ మధ్యే జగన్ విశాఖ శారదాపీఠంలో పూజలు చేసినట్లు సమాచారం. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. ఎన్టీవీ చౌదరి కుమార్తె నిశ్చితార్థంలో తనకు ఎదురైన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీకి పాదాభివందనం చేసి మరీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.అయితే దీనిలో రెండు కో ణాలున్నాయంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు.
మోదీ – అమిత్ షా. వీళ్ల మనసులు గెలుచుకోవాలంటే తాను హిందూ సంప్రదాయాలు పాటించాలి. ఈసారి ఎలాగైనా బీజేపీకి దగ్గరై పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న జగన్.. అందులో భాగంగానే గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారట.
ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మీద క్రిస్టియ‌న్ ముద్ర కొంత‌మేర‌కు పనిచేసిన సంగ‌తి తెలిపిందే. దానికి ప్ర‌ధానంగా విజ‌య‌మ్మ చేతిలో బైబిల్ పెట్టుకుని ప్ర‌చారం చేయ‌డం కూడా ఊత‌మిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తాజాగా యాగం ప్రారంభించ‌డం ఆస‌క్తి రేపుతోంది. మ‌త ముద్ర‌ను చెరిపేసుకోవ‌డానికి జ‌గ‌న్ అండ్ కో చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా క‌నిపిస్తోంది.
హైదరాబాద్ మలక్‌పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో ‘శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం’ ప్రారంభమైంది. వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం యాగ సంకల్పం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రారంభమైన యాగం ఫలితాలు వెల్లడయ్యే వరకు కొనసాగుతుంది. చూడాలి జ‌గ‌న్‌ను ఏమేర గ‌ట్టెక్కిస్తాయ‌న్న‌ది.

https://www.youtube.com/watch?v=5fw3RGyDUzo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -