Sunday, May 12, 2024
- Advertisement -

బాబు బీసీ స‌భ‌కు వైసీపీ కౌంట‌ర్‌

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు రాకీయ పార్టీల్లో కాక‌ను రేపుతున్నాయి. విజ‌యం కోసం అన్ని పార్టీలు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అధికారం కోసం టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఇరు పార్టీలు బీసీల‌ను అక‌ర్శించేందుకు పోటీ ప‌డుతున్నాయి. మొద‌టి నుంచి టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు అనుకూలంగానే ఉండేది. కాని రాను రాను బీసీ ఓటుబ్యాంకు దూరం అయ్యింది. వారి ఓట్ల‌ను త‌మ‌వైపు మ‌లుచుకొనేందుకు బాబు పావులు క‌దుపుతున్నారు.

ఫిభ్ర‌వ‌రి మూడో వారంలో ఎన్నిక‌ల నోటిఫికేషన్ రానుంద‌న్న వార్త‌ల‌తో బీసీల‌ను ఆక‌ట్టుకొనేందుకు రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జయహో బీసీ సదస్సు నిర్వహించారు.బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. బీసీల‌కు వ‌రాల జ‌ల్లులు కురిపించారు. ఈ వేదికపై నుండి వైఎస్‌ఆర్‌పై, వైసీపీపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.

ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు బాబు నిర్వ‌హించిన బీసీస‌భ‌కు స‌భ‌కు కౌంట‌ర్‌గా వైసీపీ కూడా బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా జ‌గ‌న్ త‌న కార్యాల‌యంలో నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జగన్‌తో సోమవారం నాడు బీసీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలో బీసీ సమస్యలపై అధ్యయనం చేసిన పార్టీ నేతల బృందం సోమవారం నాడు జగన్‌తో లోటస్‌పాండ్‌లో సమావేశమైంది. ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నవరత్నాల్లో బీసీలకు మరిన్ని పథకాలను ప్రకటించే యోచనలో ఆ పార్టీ ఉంది. ఈ విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు.ఏలూరులో సభ నిర్వహణ వల్ల ప్రయోజనం లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏలూరు కాకపోతే మరో ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. త‌ర్వ‌లోనే బీసీ స‌భ‌ను ఎక్క‌డ నిర్వ‌హంచేది స్ప‌ష్ట‌త రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -