Friday, March 29, 2024
- Advertisement -

సీఎంకు షర్మిల సవాల్​.. ముక్కు నేలకు రాయాలంటూ చురకలు..!

- Advertisement -

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​ రెడ్డి నియామకం కావడం, వైఎస్​ఆర్​ తనయ షర్మిల వైఎస్సార్​ టీపీ పార్టీ ప్రకటించడం. బీజేపీ అధ్యక్షుడు సంజయ్​ పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఇటీవల తన పార్టీని ప్రకటించిన షర్మిల వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం తాడిపత్రి గ్రామంలో షర్మిల దీక్షను ప్రారంభించారు.

తాడిపత్రి గ్రామానికి చెందిన నిరుద్యోగి కొండల్​ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షర్మిల ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతున్నది. ఇక అక్కడ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిల వెంట ఆమె అనుచరులు, వైఎస్సార్​టీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్​ మాట తప్పారని.. ఇప్పుడు ఆయన ముక్కు నేలకు రాస్తాడా? అంటూ ఆమె ఫైర్​ అయ్యారు.

ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై తొలిసారిగా స్పందించింది వైఎస్సార్​ టీపీయేనని ఆమె పేర్కొన్నారు. అంతేకాక తన పోరాటం వల్లే సీఎం కేసీఆర్​ ఉద్యోగ నోటిఫికేషన్​ వేశారని చెప్పుకొచ్చారు. ఇక సభకు వివిధ గ్రామాల ప్రజలు, వైఎస్సార్​ అభిమానులు హాజరయ్యారు. షర్మిల ప్రధానంగా సీఎం కేసీఆర్​ టార్గెట్​గా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయ సలహాదారు ప్రియ సూచనల మేరకు ఈమె దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్​.

Also Read

రజినీ మక్కల్ మండ్రం రద్దు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -