Monday, April 29, 2024
- Advertisement -

చంద్ర‌బాబును క‌ల‌వ‌నందుకు బాధ ప‌డుతున్న మాల్యా, నీర‌వ్‌

- Advertisement -

స్కామ్‌లు చేయాల‌నుకుంటున్నారా? నేరాలు చేసి త‌ప్పించుకోవాల‌నుకుంటున్నారా? అయితే రండి ఏపీకి.. మేమున్నాం మిమ్మ‌ల్ని కాపాడాటానికి మేమున్నాం.. కాక‌పోతే మాకు సంబంధించిన సంస్థ‌ల‌లో, పార్టీల‌కో కాస్త ల‌బ్ధి చూకూర్చితే చాలు అన్న‌ట్టుంది ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల వైఖ‌రి.

గ‌డచిన కొన్ని రోజుల నుంచి జ‌రుగుతున్న తంతు చూస్తుంటే ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రి ఎలా ఉందంటే.. నేరాభియోగాలున్న వ్యక్తులను, సంస్థలను వెనకేసుకొని రావటం, వాళ్ళ పై కేంద్రం గాని, పొరుగు రాష్ట్రాలు గాని విచారణ సంస్థలను పంపించి విచారణ జరపాలనుకుంటే, ఏపిలో ఆ సంస్థల ప్రవేశాన్నే నిషేదించ‌డం… అంతే కాదు నేరాభియోగాలున్న వారిపై దాడులను – ఏపి ప్రజలపై కేంద్రమో? తెలంగాణానో? దాడి చేస్తున్నాయని ప్రచారం చేయటం చూస్తుంటే అంతర్జాతీయ నేరాభియోగాలు మోపబడిన వాళ్ళను, సమాచార చోరులను, దగా కోరులను, అవినీతి పరులను, ఇసుక మాఫియా గాళ్ళను, ప్రభుత్వోధ్యోగులపై దాడి చెసేవాళ్ళను, మహిళలపై లైంగిక దోపిడీ గాళ్ళను, భూకబ్జా గాళ్ళను ఇలా లెక్కకు మిక్కిలి నేరగాళ్ళను కాపాడుకుంటూ వచ్చే రాష్ట్రం ఒకే ఒక్కటే ఉంది అదే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఇతర రాష్ట్రాలవారు.

ఓ వైపు ప్ర‌భుత్వం నుంచి స‌పోర్టు ఇస్తూ.. మ‌రోవైపు ఆ వార్త‌ల‌ను వెళ్ల‌కుండా.. వెళ్లినా వారికి అనుకూలంగా పంపించే మీడియా కూడా ఈ వ్య‌వ‌స్థ సొంతం. ఇప్ప‌టివ‌ర‌కు చెప్పింది ఎవ‌రి గురించో చెప్పకుండానే అర్ధం చేసుకోగలరు ప్ర‌జ‌లు.

ఇక డేటా చోరి కేసు విష‌యానికి వ‌స్తే టీడీపీ డేటా పోయిందని దాని గురించి ఆదారాలను చంద్రబాబు బయట పెడతారంటూ ఆయ‌న అనుకూల‌ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని, తీరా చూస్తే ఆయన కొత్త విషయం ఒక్కటి కూడా చెప్ప లేదని, దాంతో టిడిపి మీడియాకే తీవ్ర నిరుత్సాహం కలిగిందంటూ విప‌క్ష నేత‌లు ఎద్దేవ చేస్తున్నారు.

ఇక ఈ కేసులో కీల‌క నిందితుడిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ అధినేత దాక‌వ‌ర‌పు అశోక్‌ను ఏపీ ప్ర‌భుత్వం ర‌క్షిస్తోంద‌నే వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అతడు ఏ నేరమూ చేయకపోతే ఎందుకు పరారిలో ఉన్నారు? ఒకవేళ అతడు తన సంస్థ ద్వారా డీల్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ సమాచారం మాత్రమే అయితే, పోలీసుల వద్దకు వచ్చి అసలు విషయాన్ని చెప్పి ఎందుకు కేసును ఎదుర్కొవ‌డం లేదు? ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి, తమకు అన్యాయం జరుగుతోందని, తన కంపెనీపై అక్రమ దాడులు సోదాలు జరిగాయని, తమకు సంబంధించిన డేటాను సైతం పట్టుకుపోయారని, అతడు వాపోవడం లేదు.

ఇవేమీ జ‌ర‌గ‌డం లేదు స‌రిక‌దా.. ఆయ‌న త‌ర‌పున చంద్ర‌బాబు వ‌క‌ల్తా పుచ్చుకొని ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ట్వీట‌ర్ వేదిక‌గా ఓ యుద్దమే చేస్తున్నారు. అతడి పై కేసులు పెడితే తమపైనే కేసులు పెట్తినట్లు చంద్ర‌బాబు, లోకెష్ ఎందుకు “గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు” స్పందించారు? అనెది ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుమానం.

ఈ తతంగమంతా చూసి లండ‌న్‌లో ఉన్న నీర‌వ్‌మోదీ, విజ‌య్ మాల్యా మ‌నం అన‌వ‌స‌రంగా దేశం విడిచి వ‌చ్చాం.. ముందే చంద్ర‌బాబును క‌లిసుంటే దేశంలో ద‌ర్జాగా తిరిగే వాళ్లం క‌దా అని అనుకుంటున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -