Friday, April 19, 2024
- Advertisement -

భార‌త్ లో 21 ఫేక్ యూనివ‌ర్శిటీలు

- Advertisement -

ప‌బ్లిసిటీ చూసి మోస‌పోయి….అది ఎలాంటి యూన‌వ‌ర్శిటీనో తెలియ‌కుండా డ‌బ్బులు క‌ట్టేసి చ‌దివేస్తోన్న విధ్యార్ధుల‌కు దిమ్మతిరిగిపోయే వార్తనొక‌టి యూజిసి ఇచ్చింది.ఏకంగా దేశ వ్యాప్తంగా న‌డుస్తోన్న వాటిలో ఏకంగా 21 యూనివ‌ర్శిటీలు న‌కిలీవ‌ని తేల్చిపారేసింది. 

వాటిలో 8 ఉత్తర ప్రదేశ్ ,6 ఢిల్లీలో ఉన్నాయి.అలాగే త‌మిళ‌నాడు,క‌ర్ణాట‌క‌,కేర‌ళ‌,మ‌హారాష్ట్ర,మ‌ధ్య ప్రదేశ్ ,బీహార్ ,ప‌శ్చిమ బెంగాళ్ లో ఉన్నాయి.

 యూనివ‌ర్శిటీ గ్రాంట్ క‌మీష‌న్ యాక్ట్ 1956 ప్రకారం……. సెంట్రల్ ,స్టేట్ ,ప్రొవిన్షల్ యాక్ట ప్రకార‌మే  ఏ యూనివ‌ర్శిటీ నైనా స‌రే న‌డిపించాలి. లేదా సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్ యూనివ‌ర్శిటీని నెల‌కొల్పుకోవ‌చ్చు. ఒక వేల ఏ యూనివ‌ర్శి అయినా సెక్షన్ 23 యాక్ట్ ప్రకారం న‌డిపుకున్నట్లయితే మాత్రం అది నిషేదించ‌బ‌డుతుంది.

ఢిల్లీకి చెందిన Varanseya Sanskrit Vishwavidyalaya, Commercial University Ltd, United Nations University, Vocational University, ADR-Central Juridical University and ADR-Central Juridical University లు నిషేదించ‌బ‌డిన‌వాటిలో ఉన్నాయి.

నేడో రేపో మ‌రిన్ని యూనివ‌ర్శిటీల పేర్లు కూడా బ‌య‌ట‌కు రావ‌చ్చు.మ‌రి వాటిలో మీది లేద‌నే ఆశ‌లోనే ఉండండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -