Friday, April 26, 2024
- Advertisement -

హ…హ…హా……. రాధాకృష్ణ సామాన్యుడా? ఈ ఇయర్ బెస్ట్ జోక్

- Advertisement -

జర్నలిజంలో సీనియారిటీ వచ్చే కొద్దీ ఎవరైనా సరే కాస్త హుందాతనం అలవర్చుకుంటూ ఉంటారు. మరీ దిగజారిపోయి భజన చేసే బాసుల స్థాయి జర్నలిస్టులు మన దగ్గర రాధాకృష్ణ తప్ప ఇంకెవ్వరూ లేరు. చంద్రబాబుకు సాయం చేయడం కోసం ఎలాంటి వార్తను అయినా రాస్తూ ఉంటాడు. చంద్రబాబు-కెసీఆర్‌లను కలిపి వెలమ-కమ్మ గ్రూపును ఏర్పాటు చేసి మోడీని కూడా ఎదుర్కునే స్థాయిలో బాబు బలం పెంచాలన్న ఉబలాటంలో చాలానే చేస్తూ ఉన్నాడు రాధాకృష్ణ. ఇక 2014లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం రాధాకృష్ణ చేసిన మీడియా రాతల రాజకీయం అంతా ఇంతా కాదు. అలాంటి రాధాకృష్ణ రాసిన ఈ వీకెండ్ కామెంట్‌లో కొన్ని విషయాలు మాత్రం మరీ కామెడీగా ఉన్నాయి. ఈ వ్యాసం మొత్తంలో కూడా పదే పదే తనను సామాన్యుడిగా చూపించుకునే ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ. మోడీ రాజకీయాల దెబ్బకు సామాన్యులమైన మనం మోసపోతున్నాం…… మనం పిచ్చోళ్ళమవుతున్నాం అంటూ చాలా సార్లు రాసుకొచ్చాడు.

నిజానికి రాధాకృష్ణ రాయాల్సిన పద్ధతి అదికాదు. తెలంగాణా విషయం పక్కన పెడితే 2014 ఎన్నికల ముందు నుంచీ ఇప్పటి వరకూ సీమాంద్ర ప్రజలను భలే పిచ్చోళ్ళను చేశాం అని రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీకి బాబుకు దూరం పెరిగింది కాబట్టి రాధాకృష్ణ వారు మోడీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు కానీ 2014 ఎన్నికల సమయంలో ఇదే మోడీని సీమాంద్రుల నెత్తిన రుద్దింది ఎవరు? మోడీ వస్తే పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా ఖాయం అని చెప్పింది ఎవరు? మోడీ వస్తే అవినీతే ఉండదు….అంతా అద్భుతం అని ఓ స్థాయిలో వార్తలు వడ్డించి ప్రజలను తప్పు దోవ పట్టించింది ఎవరు? బాబు-మోడీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇక ఆ ఇద్దరు నాయకులు చాలా గొప్పోళ్ళు అని సీమాంద్ర ప్రజలను నమ్మించడానికి రాధాకీష్ణ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. మోడీ-బాబులు అధికారంలోకి వచ్చారు.

మూడున్నరేళ్ళ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఏముంది? రాధాకృష్ణ లాంటి వాళ్ళ మాటలను నమ్మిన సీమాంధ్రప్రజలు అడ్డంగా మోసపోయారు. హోదా లేదు. రైల్వే జోన్ లేదు. రాజధాని నిధులు లేవు. ఇక బాబు-మోడీలు పోలవరం చుట్టూ ఆడుతున్న డ్రామా అంతా ఇంతా కాదు. 2జీ స్పెక్ట్రమ్ తీర్పు దెబ్బకు అవినీతిని పారదోలడం అనే విషయంలో మోడీ చిత్తశుద్ధి కూడా తెలిసిపోయింది. అయినా అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే నంబర్ ఒన్‌గా నిలబెట్టిన చంద్రబాబునాయుడి ముందు మోడీ అవినీతి పెద్దది అవుతుందా?

మొత్తంగా చూసుకుంటే రాధాకృష్ణ లాంటి రాజకీయ భజన జర్నలిస్టుల మాటలు విని ప్రజలు అడ్డంగా మోసపోయారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ………ఇలాంటి జర్నలిస్టుల మాటలు నమ్మి మోసపోయాం అని ప్రజలు రియలైజ్ అవుతారన్న భయమో ఏమో కానీ ఇప్పుడు తనను తాను సామాన్యుడిగా చెప్పుకుంటున్నాడు రాధాకృష్ణ. అయినా రాధాకృష్ణ నష్టపోయాడంటే ఎవరు నమ్ముతారట? అధికారంలో ఉన్నవాళ్ళ నుంచి రాధాకృష్ణ పొందుతున్న ప్రయోజనాలు…..కోటీశ్వరుల జాబితాలో రాధాకృష్ణ ఎదుగుతున్నవైనం ఎరుక లేనివాళ్ళు ఎవరున్నారు కనుక? అయితేనేం అబద్ధాలు చెప్పి మోసగించడం అలవాటయ్యాక …….ఒక అబద్ధం గురించి ప్రజలకు తెలిసిపోయేలోపు మరో అబద్ధానికి తెరలేపడం అంటే ఇదేనేమో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -