Sunday, May 19, 2024
- Advertisement -

శభాష్… ఆయనొచ్చాడు… అవినీతిలో నం.1… ఇప్పుడు అబలలపై అత్యాచారాలు, దళితులపై దాడుల్లో కూడా ఎపి నం.1

- Advertisement -

ఆయనున్నప్పుడే బాగుండేది… ఆయన రావాలి అని చెప్పి పబ్లిసిటీ ఊదరగొట్టారు. ఇక భజన మీడియా జనాలు అయితే చెవులకు చిల్లులు పడేలా మోత మోగించారు. ఇక మేధావులమని చెప్పుకునే తైనాతీలు చాలా మంది ఆయన రావాలన్నారు. ఆ అనుభవం కావాలన్నారు. బోనస్‌గా అప్పటికప్పుడు అత్యవసరంగా స్టార్ హోటల్‌లో రాజకీయ రంగు వేసుకున్న పవర్ఫుల్ నటుడు కూడా రంగంలోకి దిగాడు. ఆయన అనుభవం కావాలన్నారు. మోడీ-బాబు అభివృద్ధి జోడి అన్నారు. ఆ ప్రచారం దెబ్బకు… కేవలం ప్రచారం తెలివితేటలే…… ఆయనొచ్చాడు. పదేళ్ళ తర్వాత అధికారం కదా…… ఆయన బినామీలు, భజన బృందం…. ఆయనను ఆడిస్తున్న రాజగురువులు అందరూ ఆనంద తాండవం చేశారు. మూడున్నరేళ్ళ కాలం గడిచిపోయింది. ఇప్పటికీ వాస్తవాలను మరుగున పడేస్తూ గ్రాఫిక్స్ ప్రచారం, అబద్ధాల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారనుకోండి. కానీ వాస్తవాలు మాత్రం బయటపడిపోతున్నాయి.

మొన్నటికి మొన్న అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ ఒన్‌గా నిలిచింది. ఇక తాజాగా ఆయన రావాలి…..ఆయన ఉన్నప్పుడే బాగుండేది అని మహిళలను నమ్మించేలా ఏ ప్రచారం చేశారో…ఏ ప్రచారంతో అధికారంలోకి వచ్చారో….ఆ ప్రచారం అంతా కూడా ఎంత డొల్లో సాక్షాత్తూ అధికారిక లెక్కల్లోనే బయటపడింది. అబలలపై అత్యాచారాలు, దాడులు, హింస విషయంలో శ్రీ మాన్ ……ముప్ఫై ఏళ్ళ అనుభవజ్ఙడు….ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకున్నవాడు…..అయిన శ్రీ చంద్రబాబునాయుడిగారి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగ్విజయంగా నంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. అలాగే దళితులపై దాడుల విషయంలో కూడా శ్రీమాన్ చంద్రబాబుగారి అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం వళ్ళ ఆంధ్రప్రదేశే నంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికీ కూడా ఈ సామర్థ్యం లేకపోయింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కన్నీళ్ళ నాటకాలు, బాబు ఉన్నప్పుడే బాగుందన్న భజన మీడియా బాకాలన్నీ కూడా ఉత్త ప్రచార పటాటోపాలే అని అధికారికంగా తెలిసిపోయింది. ఇప్పుడిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారు ఏం చెప్తారో చూడాలి. చంద్రబాబుకే ఓటెయండి……ఆయనొస్తేనే అంతా బాగుంటుంది అని ఎన్నికల సమయంలో చెప్పారు. మరి ఈ బ్రహ్మాండమైన బాగును సాధించి మహిళలపై దాడుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన బాబుగారిని పవన్ బాబు ఏ విధంగా సన్మానిస్తాడో చూడాలి. వెంకయ్యనాయుడు నుంచి బాబు భజన మీడియాతో సహా బాబుగారికి ఏ స్థాయిలో సన్మానం చేస్తారో చూడాలి. ఇక ఆ సన్మాన సభలో మహిళలపై అత్యాచారాలు, దాడుల విషయంలో, దళితులపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ని దిగ్విజయంగా నంబర్ ఒన్ స్థానంలో ఎలా నిలబెట్టారో…….అందుకోసం ఎన్ని రాత్తులు నిద్రపోలేదో……ఏ ఎర్ర బస్సులో పడుకుని పనిచేశారో……మనవడిని కూడా చూడకుండా ఎన్ని రోజులు కష్టపడ్డారో ఆయన నోటి వెంట ఆయన చెప్పుకుంటేనే అదో తుత్తి. ఆలోచనాపరులయిన జనాలు మాత్రం కచ్చితంగా బాబుగారు, పవన్‌గారు, ఆయన భజన మీడియా బృందం ఏం చెప్తారో అని వినాలనుకుంటున్నారు. అన్నట్టు 2019 బాబుగారి ఎన్నికల వ్యూహం కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్ అవుతున్న జయప్రకాష్ నారాయణ కూడా ఏం చెప్తాడో చూడాలి.

పాలనా సామర్థ్యం అంటే ఏంటి? రాష్ట్రం కోసం అహర్నిశలూ పాటుపడడం అంటే ఏంటి? ఎప్పుడూ జరిగిపోయిన రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ మొసలి కన్నీళ్ళు కార్చడమా? కేంద్రం అన్యాయం చేస్తోందని సెంటిమెంట్ డ్రామాలు నడపడమా? 2019లో మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా అన్న ఆలోచనే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనిని చిత్తశుద్ధితో చేద్దామన్న ఆలోచన ఉందా? తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పటి వరకూ అధికారంలోకి రాని జగన్‌కి ఇంకా చేతకానివాడిలాగా చూపడమా? వీడియో, ఆడియా సాక్ష్యాలతో దొరికిపోయిన తన అవినీతిని కప్పిపుచ్చుకుంటూ జగన్‌ని పెద్ద అవినీతిపరుడుగా చూపెట్టే ప్రయత్నం చేయడమా? సమర్థుడు ఎప్పుడూ కూడా ప్రత్యర్థి ని అసమర్థుడిగా చూపించి…..ప్రత్యర్థిని తనకంటే భయకంరమైన వాడిగా చూపించి విజేతగా నిలవాలనుకోడు. తన సమర్థతను నిరూపించుకుని గెలుస్తాడు. మూడున్నరేళ్ళలో గ్రాఫిక్స్ బొమ్మలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న మాటలు తప్ప చేసిన ఒక్క పనిని చూపించమనండి. ఎన్నికల్లో ఇఛ్చిన ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చారా? మోడీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఒక్క ప్రయోజనాన్ని తీసుకురాగలిగారా? అంతా కూడా చేతకానితనం, చేవలేనితనం…….అదేమంటే మోడీ బలవంతుడు అంటారు. విభజిత రాష్ట్రం అని చెప్పి బేలగా మాట్లాడతారు. రాష్ట్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు.

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన వాళ్ళను శిక్షిస్తాడేమో…..కానీ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం మంచిదే. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని మేం చెప్పలేదని తాజాగా నీతి అయోగ్ సభ్యుడు ఒకతను చెప్పాడు. ఆల్రెడీ హోదా ఉన్న రాష్ట్రాలకు ఇంకో పదేళ్ళు పొడిగించారు. అక్కడి ప్రజల పోరాడారు. తేడా వస్తే……తేడా చేస్తే ఇంకా పోరాడతారని, దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వస్తుందని మోడీ భయం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి సమస్య ఏముంది? విభజన పాపంలో సమాన భాగం పంచుకున్న భాజాపాకు ఓట్లు పడేలా చేయడంలో చంద్రబాబు, బాబు భజన మీడియా, పవన్ కళ్యాణ్‌లు చేయలేదా? వభజన పాపం నుంచి బాబు బయటపడలేదా? ఇప్పుడు మాత్రం ఏం పోతుంది. హోదా పోరును అణచడానికి బాబు ఉన్నాడు. మోడీపై వ్యతిరేకత రాకుండా చూడడానికి బాబుగారి భజన మీడియా, మరీ ముఖ్యంగా నంబర్ ఒన్ పత్రిక అధినేత రాజగురువు ఉన్నారు. 2019 నాటికి మరోసారి ప్రచార డ్రామాని రక్తికట్టించి …….ఏమీ చేయకపోయినా బాబు-మోడీలే ఆంధ్రప్రదేశ్‌కి దిక్కు అని నమ్మించడానికి అవే అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఏం భయం ? ఎందుకు భయం? అవినీతిలో, మహిళలపై దాడులు, అత్యాచారాల విషయంలో, దళితులపై దాడుల విషయంలో నంబర్ ఒన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ ఒన్‌గా నిలపడానికి మూడున్నరేళ్ళు పట్టింంది. ఇంకో ఆరున్నరేళ్ళు కూడా అధికారం అప్పగిస్తే దేశంలోనే అన్ని క్రైమ్స్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో కచ్చితంగా నిలబెడతాడు. ఎనీ డౌట్స్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -